నవతెలంగాణ- రామారెడ్డి
కాంగ్రెస్ ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్ మోహన్ రావు సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు, ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని మంగళవారం అన్నారు. మండల కేంద్రంలో ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ… ఓటు కత్తి కంటే పదునైనదని, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు వల్లనే, ప్రతి ఒక్కరు ఇంటింటికి వస్తున్నారని, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని తమ కుటుంబాలను బాగుపరచుకోవాలని, మోసపోయి గోసపడవద్దని సూచించారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ హయాంలో లోవోల్టేజ్ తో మోటార్లు ఖాళీ, రాత్రుల్లో పాము కాటు, కరెంటు షాక్ లతో రైతులు చనిపోయి గోసపడ్డారని గుర్తు చేశారు. 24 గంటల కరెంటును రైతులకు ఉచితంగా , బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు బీడీ పింఛన్లు, దేశంలో అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. 5 సంవత్సరాల్లో పలు అభివృద్ధి పనులను చేసుకున్నామని, మరో 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అవినీతిపై మదన్ మోహన్ రావు చేసిన ఆరోపణలకు, కాలభైరవ స్వామి లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఒక రూపాయి తీసుకోకుండా పార్టీ మారానని, అభివృద్ధి ద్వేయంగా పనిచేశానని, ఎల్లారెడ్డి గడ్డ, ఉద్యమాలకు అడ్డా అని, మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయం పూర్తి కావడంతో, ప్రచారాన్ని రామారెడ్డి లో ముగించారు. కార్యక్రమంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ గౌడ్, స్థానిక సర్పంచులు సంజీవ్, కందూరి బాలమణి లింబాద్రి, ఎంపిటిసి రజిత రాజేందర్ గౌడ్, నారాయణ రెడ్డి, బానురి నర్సారెడ్డి,పడిగల శ్రీనివాస్ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.