బండెనుక.. బండి పెట్టి.. లైన్లలో వరి ధాన్యం వాహనాలు

 ధాన్యం దిగుమతి కోసం నిరీక్షణ
నవతెలంగాణ-శాయంపేట
బండెనుక.. బండి.. అన్నట్టు రైస్‌ మిల్లుల వల్ల వరి ధాన్యం వాహనాలు బారులు తీరాయి. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌ మిల్లులకు ధాన్యం దిగుమతి చేయడానికి వచ్చిన వాహనాలు రోడ్డు పక్కన లైన్లలో భారీగా వాహనాలు నిలిచి ఉన్నాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని ట్రాక్టర్లు, డీసీఎం వ్యాన్లు, టాటా ఏసీ వాహనాల్లో నింపి ట్రక్‌ షీట్ల ఆధారంగా మిల్లులకు పంపిస్తున్నారు. పరకాల -హనుమకొండ ప్రధాన రహదారిలోని మాందారిపేట స్టేజి సమీపంలో ఉన్న శ్రీనివాస రైస్‌ మిల్లులో ధాన్యం దిగుమతిలో జాప్యం వల్ల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి ఉన్నాయి. వేసవిలో ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో హమాలీలు ఉదయం, సాయంత్రం వేళల్లోనే ధాన్యం బస్తాలు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో వాహన యజమానులు ధాన్యం దిగుమతి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.