నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీవైఎస్, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె కాశీనాథ్,కెఎస్ ప్రదీఫ్, డి స్వరూప,సిహెచ్ శిరోమణి ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ముందు డీలర్ల సంఘాలుంచిన 11 డిమాండ్ల పరిష్కారం కోసం జూన్ 5 నుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారనీ , దీనికి మద్దతు తాము ప్రకటిస్తున్నామని తెలిపారు.