ప్రముఖ చరిత్రకారుడు ఎర్రిక్ హాబ్స్ బామ్ చెప్పినట్లు, ప్రతి జాతీయవాదం తన సొంత చరిత్రను నిర్మించుకుంటుంది. ”నల్లమందు బానిసత్వానికి గసగసాలు ఎలాగో, జాతీయ వాదానికి చరిత్ర అలా” అనేది ఆయన సూత్రీకరణ. అలాగే ప్రతీ జాతీయవాదం తన భావజాలానికి అనుగుణంగా తన సొంత యోధులను సష్టించుకుంటుంది. తమ యోధులను సష్టించడానికి, ఆ యోధులు అనుసరించిన మార్గాన్ని వ్యతిరేకించిన వారిని కూడా అపకీర్తిపాలు చేస్తారు.
ఈ కార్యాచరణకు పరిపూర్ణతతో కూడిన నైపుణ్యమైన రెండు వ్యూహాలు అవసరం. ఒకటి, ప్రోత్సాహించాలని అనుకున్న యోధులను సమర్థించడం. రెండు, ప్రత్యర్థి నాయకుల గురించి ప్రతికూలంగా విస్తత ప్రచారం చేయ డం. ఇదే ప్రస్తుతం భారతదేశంలో జరుగుతుంది. ఒకవైపు మితవాద నాయకుడైన నాథూరామ్ గాడ్సే గురించి స్తుతించడం జరుగుతుండగా, మరోవైపు మహాత్మాగాంధీ గురించి ప్రతికూలమైన అంశాలు ప్రచారం చేస్తున్నారు.
గాడ్సే కోసం దేవాలయాలు నిర్మించాలనే డిమాండ్లు నిరం తరం ఉంటూనే ఉన్నాయి. అతని పేరును కూడా అనేక విశేషణాలతో గౌరవిస్తున్నారు, కానీ ఆయన ఒక్కడే కాదు. మాలేగావ్ బాంబు దాడిలో నిందితురాలు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యురాలు అయిన ప్రజ్ఞాఠాకూర్, ‘గాడ్సే గతంలో, ఇప్పుడు, భవి ష్యత్తులో కూడా దేశభక్తుడే’ అని వాదిస్తూ వస్తుంది. గాడ్సే గురు వు, సలహాదారు, హిందూత్వ స్థాపకుడైన వినాయక దామోదర్ సావర్కర్ చిత్రపటం ఇప్పటికే లోక్‌సభలో వేలాడుతోంది. ఇప్పుడు ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.
గాడ్సే చేతిలో హత్య గావించబడిన గాంధీని ప్రతికూలమైన వ్యక్తిగా చూపించే ప్రయత్నంలో ఆయన హత్యకు సంబంధించిన వాస్తవాలను కూడా చెరిపి వేస్తు న్నారు. ఇప్పటికే ఆ వాస్తవాలు చాలా పాఠ్య పుస్తకాల్లో లేకుండా పోయాయి. ఇటీవల కాలంలో గాంధీజీ ఆత్మహత్య చేసుకున్నాడనే తప్పుడు వార్త లను వ్యాప్తి చేసే ప్రయత్నాలు కూడా ఊపందు కున్నాయి. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన తొమ్మిదవ తరగతి పరీక్షలో ఒక ప్రశ్న రూపంలో ఆ తప్పుడు వార్త ప్రతి బింబించింది. ఆ ప్రశ్న: ”గాంధీ ఆత్మహత్య కు ఎలా పాల్పడ్డాడు?”. దేశ విభజనకు ఆయనే కారణమనీ, ఆయన వల్లే పాకిస్థాన్‌కు 55 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చిందనీ, ఆయన హిందూ వ్యతిరేకి అనీ, ముస్లింలను తప్తి పరిచినందుకే ఆయన హత్య చేయబడ్డాడనే ప్రచారం ఇప్పటి దాకా సాగింది.
గాడ్సేను దేశభక్తునిగా స్తుతించిన కొత్తగా వచ్చిన పార్ల మెంట్ సభ్యురాలు, ప్రజ్ఞా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నుండి పోటీ చేయడానికి టికెట్ ఇచ్చిన తన పార్టీని కాపా డేందుకు తరువాత క్షమాపణలు చెప్పింది. అదే సమయంలో గాంధీజీని అపఖ్యాతి పాలు చేయడానికి, అంబేద్కర్ ఆయనపై చేసిన విమర్శలను సామాజిక మాధ్యమాల్లో విస్తతంగా ప్రచా రం చేస్తున్నారు. అంబేద్కర్ ఆయనపై చేసిన విమర్శలను కొన్నింటిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని వాటిని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారు.
ఈ అసంబద్ధమైన మాటలు, బహూళ ప్రయత్నాలు, గాడ్సే ను కీర్తించి, అతడు గాంధీని హత్య చేయడాన్ని సమర్థించేందుకు ఉద్దేశించిన లక్ష్యంగా ఉన్నాయి. కానీ గాడ్సే ఎవరు? ఆయన తన రాజకీయ జీవిత గమనాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ప్రచారక్‌గా ప్రారంభించి, ఆ తరువాత సావర్కర్ నాయకత్వం లోని హిందూ మహాసభలో చేరాడు. హిందూత్వ శక్తుల ప్రయ త్నాలు, గాంధీజీ అభిప్రాయాలను వివరించేందుకు కాకుండా, ఆయన చేసిన పనుల్లో దొర్లిన చిన్నచిన్న తప్పుల్ని వెతికేందుకు ఉద్దేశించబడుతున్నాయి. గాంధీని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిం చేందుకు, ఆయనకు ఇతర జాతీయ నాయకుల మధ్య ఉన్న భేదా భిప్రాయాలను గోరంతలను కొండంతలు చేసి చెప్పాలను కుంటున్నారు. గాంధీ, అంబేద్కర్‌కు వ్యతిరేకం అని తెలిపే పూణే ఒప్పందం ఒక ప్రధానమైన అంశంగా మారింది. ఈ ఒప్పం దంపై ఇద్దరు నాయకులూ సంతకాలు చేశారు, కానీ అణగారిన వర్గాల వారి రాజకీయ, సామాజిక భవిష్యత్తుకు సంబంధించిన నిబంధనలపై వారిరువురికీ ఏకాభిప్రాయం కుదరలేదు.
ఔను గాంధీ, అంబేద్కర్‌లు విభేదించుకున్నారు. కానీ వారి విభేదం వ్యూహాత్మక స్థాయిలో ఉంది. ఉదాహరణకు” ప్రత్యేక ఓటర్ల” విధానం భారతదేశంలో వలసవాద వ్యతిరేక పోరాట ఐక్యతను బలహీన పరుస్తుందని గాంధీ విశ్వసించాడు. ఆయన, అంటరానితనాన్ని అంతం చెయ్యాలని నొక్కి వక్కాణించాడు. రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరచడానికి గాను ఆయన నియోజకవర్గాల రిజర్వేషన్లపై పట్టుపట్టాడు. వైవిధ్యమైన గుర్తింపులతో నిమిత్తం లేకుండా భారతీయులందరినీ తన వెంట తీసుకొని వెళ్ళాల్సి వస్తుందని, వలసవాద వ్యతిరేక ఉద్యమ నాయకునిగా గాంధీజీ విశ్వసించాడు.
స్వాతంత్య్ర లక్ష్యాన్ని సాధించే మార్గాల గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. ఈ కారణంగానే, భగత్‌సింగ్, అతని అనుచరుల పట్ల గౌరవం ఉన్నప్పటికీ ఆయన క్షమాభిక్ష కోసం కేసుపై పట్టుపట్టలేదు. గొప్ప జాతీయవాది అయిన భగత్‌సింగ్ కూడా నైతిక కారణలతో క్షమాభిక్ష కోరలేదు.
భారత స్వాతంత్య్రోద్యమం ప్రజాస్వామిక సూత్రాలపై ఆధా రపడి ఉన్నది. వలసవాద వ్యతిరేక ఉద్యమాన్ని ఒక శక్తివంత మైన ప్రజా ఉద్యమంగా మార్చింది గాంధీ. ఒకానొక మజిలీ తరువాత, గాంధీ వ్యూహానికి ఖచ్చితంగా సరిపోనటువంటి మా ర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. స్వాతంత్య్రానికి దగ్గరగా, కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలను చేసింది కూడా నెహ్రూ, సర్దార్ పటేల్, ఇంకా ఇతర ముఖ్య నాయకులే. అన్ని నిర్ణయాలు గాంధీ ఇష్టానికి అనుగుణంగా కూడా జరగలేదు. ఉదాహరణకు, గాంధీ దేశవిభజనను అంగీకరించలేదు, ఇతరులకు అనుకూలంగా ఉన్న ఆర్థిక విధానాలతో కూడా ఏకీభవించ లేదు. గాంధీకి ఉన్న తమైన నైతిక అధికారత ఉన్నప్పటికీ, తన శిష్యులైన నెహ్రూ, పటేల్‌లు ఆయన వ్యూహాలకు భిన్నమైన వ్యూహాలను స్వీకరించారు. ”నా మాటకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో విలువ లేకుండా పోయింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణా మాల పట్ల నేను ఇష్టంగా లేను, నేను బయటికి మాట్లా డలేకపోతున్నాను”, అని గాంధీ ఒక సందర్భంలో అన్నాడు.
ఈ దష్టితో చూసినప్పుడు, అంబేద్కర్ – గాంధీల సంబంధంలో కొద్ది భేదం ఉంది. గాంధీ స్వాతంత్య్రోద్య మంలో చాలా పెద్ద నాయకుడే కానీ, నియంత కాదు. ఆ విధంగా, ఈ ఇద్దరి నాయకుల మధ్య విభేదాలకంటే ఏకీ భావమే ఎక్కువ అనే వాస్త వాన్ని చరిత్ర ధ్రువీకరిస్తుంది. ప్రజాస్వామిక ప్రాథమిక మార్గదర్శక సూత్రాలు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం లాంటి అనేక లోతైన విష యాలపై వీరిరువురూ ఒకే మార్గంలో ఉన్నారు.
గాడ్సే చెప్పిందే సరైనదని నిరూపించడానికి, (మరణా నంతరం, ఆలస్యంగా భిన్నస్వరాల నుండి కొన్నింటిని తీసు కొని వారి మధ్య ఉన్న) భేదాభిప్రాయాలను అతిశయోక్తిగా చెప్పేందుకు ప్రచారం చేస్తారు. ప్రజాస్వామ్యానికి, ప్రజా స్వామిక ఉద్య మాలకు భేదాభిప్రాయాలే ప్రాణం. ఇక్కడ ముఖ్య మైన విషయం ఏమిటంటే, గాడ్సే – సావర్కర్ అండ్ కంపెనీలు జాతీయవాద భావనల విషయంలో అంబేద్కర్, గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర స్వాతంత్య్రోద్యమ నాయకులకు భిన్నంగా ఉంటారు.
గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, పటేల్‌లు వైవిధ్యానికి అంగీ కారం తెలిపే దేశం గురించి కలలుగంటుండగా, సావర్కర్ – గాడ్సే, ఇతర హిందూ జాతీయవాదులు మాత్రం పురాణ సంబం ధమైన బంగారు గతం గురించి అదేపనిగా గతంలో మాట్లాడి, ఇప్పటికీ మాట్లాడుతునే ఉన్నారు. పుట్టుకపై ఆధారపడిన అదే గతంలో అసమానతలు అంతర్నర్మితమై ఉన్నాయి. హిందూ మితవాద శక్తులు రోజురోజుకూ దఢంగా, శక్తివంతంగా మారుతున్నాయి, కానీ వారి ఆలోచనలు ఇతరులను మినహాయించే విధంగా ఉంటున్నాయి. వారు ఇతర మతాలకు చెందిన వారికి వ్యతిరేకంగా ఉంటున్నారు. వారికి భిన్నంగా ఉన్నవారిపై వారి ఇష్టాయిష్టాలను రుద్దడానికి ఈ అన్యత్వాన్ని(అదర్నెస్) సష్టిస్తారు.
హిందూ జాతీయవాదులు ఏ భావజాలం కోసమైతే ఉన్నారో, ఆ భావజాలం కోసమే ప్రజ్ఞాఠాకూర్ నిలబడుతుంది. కానీ వారు దీనిని నిర్మొహమాటంగా స్పష్టం చేయదలచుకోవడం లేదు. వారి అన్ని కార్యక్రమాల ద్వారా గాడ్సే ప్రాతినిధ్యం వహించే భావజాలాన్ని నేర్పుగా రక్షించి,తరువాత కీర్తించాలని అనుకుంటున్నారు.
(”కౌంటర్ కరెంట్స్” సౌజన్యంతో)
అనువాదం : బోడపట్ల రవీందర్, 9848412451
రామ్ పునియానీ