నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని బాలికల హైస్కూల్, మోడల్ స్కూల్ మరియు పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్థినిలపై ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం ఎస్సై యాదగిరి గౌడ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షులు భాను గౌడ్ మాట్లాడుతూ ఆకతాయిలు బైక్ లపై త్రిబుల్ రైడ్ చేస్తూ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినిలు మనోవేదనకు గురవుతున్నారని వెంటనే పోలీస్ శాఖ చర్యలు చేపట్టి చట్టపరంగా శిక్షించాలని లేనియెడల బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, గంగోనీ లక్ష్మణ్, చరణ్ రెడ్డి, రాజేందర్ గౌడ్, రాకేష్, వినీత్, గంగోని రాము తదితరులు పాల్గొన్నారు.