విద్యుద్ఘాతంతో ఎద్దు మృతి

నాగారం: విద్యుద్ఘాతంతో ఎద్దుమృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని ఫణిగిరి గ్రామంలో చోటుచేసుకుంది. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. మండలపరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన వంగూరి కొమురయ్య రైతు ఎద్దు రోజువారీగా తన వ్యవసాయ క్షేత్రంలో మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతమై అక్కడికక్కడే మృతి చెందింది.ఎద్దు విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని బాధితరైతు వాపోయాడు.