– బీసీ ముఖ్యమంత్రి ఏజెండాగా ముందుకెళ్తాం
– బీసీల రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తాం
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్
– నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాబోయే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి ఏజెండాగా ‘ఓ..బీసీ మేలుకో నీ..రాజ్యం ఏలుకో అనే నినాదంతో ముందుకెళ్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ”వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి భవిష్యత్ రాజకీయ కార్యచరణ ప్రకటించడానికి 33 జిల్లాల బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో బీసీల రాష్ట్ర స్థాయి విస్త్రత సమావేశం” లక్డీకపూల్‌లోని సెంట్రల్ కోర్టు హౌటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీలకు ఈ భవి ష్యత్తు రాజకీయ కార్యచరణ ద్వారా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రతి గ్రామ, జిల్లా, మండల, నియోజకవర్గాల్లో విస్తతంగా ప్రచారం చేస్తూ బీసీలకు అవగాహన కల్పిస్తూ రాబోయే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి ఏజెండాగా ముం దుకెళ్తామని తెలిపారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీల ను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయనీ, బీసీ లు అంటే కేవలం ఓటు వేసే యంత్రాలుగానే ఈ రాజకీ య పార్టీల నేతలు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బడుగు, బలహీనవర్గాలు పోరాడి తేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందనీ, తెలంగాణ వచ్చిన తర్వాత 5 శాతం ఉన్న అగ్రకులాలు ముఖ్యమంత్రి, మంత్రి పీఠాలు ఎక్కుతూ బీసీలను అణగదొక్కుతున్నార న్నారు. బీసీలకు వచ్చే ఎన్నికల్లో 60 టికెట్లు ఇవ్వాలనీ, బీసీలకు రాజ్యాధికారంలో తమ వాటా కల్పించాలని డి మాండ్ చేశారు. తమ రాజకీయ కార్యాచరణలో భాగంగా బీసీ పార్టీని నెలకొల్పుతామనీ, బీసీల రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీసీ ముఖ్యమంత్రి ఏజెం డాగా, ఓ బీసీ మేలుకో..నీ రాజ్యం ఏలుకో అనే నినా దంతో జులై రెండో వారంలో బీసీ ప్లీనరీలో ‘బీసీల రాజకీ య ఏజెండా’, ఆగస్టు రెండో వారంలో ఏపీ రాజధాని అమరావతి నుంచి తెలంగాణ వరకు ‘బీసీల రథయాత్ర’, ‘బీసీ సింహ గర్జన’ కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, రాష్ట్ర సమన్వయకర్త, వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు, 33 జిల్లాల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, యువజన, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు.