అంత్యక్రియలకు ఆర్థిక సహాయం 

నవతెలంగాణ-భిక్కనూర్: మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన బాల్ రెడ్డి మరణించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు భీమ్ రెడ్డి తక్షణ సహాయార్థం అంత్యక్రియలకు రూ.5వేలు  కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ధర్మయ్య, లింగారెడ్డి, ఉప సర్పంచ్ నర్సింలు, సింగిల్ విండో డైరెక్టర్ భూమయ్య, సుధాకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.