న్యూఢిల్లీ : భారత్‌లో 60కి పైగా నగరాలకు అమెజాన్ ఫ్రెష్ సేవలను విస్తరించినట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. పండ్లు, కూరగాయలు, శీతల ఉత్పత్తులు, సౌందర్య, శిశు, వ్యక్తిగత సంరక్షణ, ఇతర రోజువారి కిరాణా సామాగ్రి తదితర విస్తృత శ్రేణీ గ్రోసరీ ఉత్పత్తులను ఇంటి వద్ద నుంచి ఆర్డర్ చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. వినియోగదారులు తమకు కావాల్సిన సమయంలో డెలివరీ పొందవచ్చని అమెజాన్ ఫ్రెష్ హెడ్ శ్రీకాంత్ శ్రీరామ్ పేర్కొన్నారు. రూ.249 పైన విలువ కలిగిన ఆర్డర్‌పై ఉచిత డెలివరీ పొందవచ్చన్నారు.
హైద