21 డిసెంబర్ 2023న రాష్ట్ర శాసన సభలో విద్యుత్ రంగంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పత్రంలో ప్రధానంగా విద్యుత్‌చ్ఛక్తి సంస్థ 31 అక్టోబర్ 2023 నాటికి రూ.81,516 కోట్లు రుణపడి ఉన్నదని నివేదించారు. ఈ బాకీలకు సంబంధించిన ఇచ్చిన వివ రణలో డిస్కాంల రుణం-62,461 కోట్లుగా ఉంది. ఇవిగాక జెన్‌కో చేసిన ఉత్పత్తి కేంద్రాల బాకీ కూడా కలిపి చెప్పారు. డిస్కాంల బాకీలో ప్రభుత్వరంగ సంస్థ లు రూ.28,842 కోట్లు గత పదేండ్లుగా బాకీ పడి ఉన్నాయి. ఈ బాకీలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలం చెందడంతో డిస్కాంల నిర్వహణలో లోపాలు జరుగుతు న్నాయి. తలసరి విద్యుత్ 2014లో 1356 యూనిట్లు కాగా 2021-22 నాటికి 2126 యూనిట్లకు పెరిగినట్లు దేశంలో పదో స్థానంలోకి వచ్చినట్లు చెప్పారు. ఆస్ట్రేలియా తలసరి వార్షిక వినియోగం 9,614 యూనిట్లు, దక్షిణ కోరియా 11,705 యూనిట్లు, చైనా 5,331 యూనిట్లు వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో తలసరి వినియోగం తగ్గినప్పటికీ ఈ రంగం గత పదేండ్లలో బాగా అభివృద్ధి చెందినట్లు మాజీ విద్యుత్‌శాఖ మంత్రి అసెంబ్లిలో వాదించారు. చివ రికి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన మూడు అంశాలపై న్యాయవిచారణకు మాజీమంత్రి జగదీష్‌రెడ్డి ఆ హ్వానించడంతో దానిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంగీకరించి న్యాయ విచారణకు ఆదేశించారు. ఈ చర్చలో వాస్తవాలు మాత్రం దృష్టికి రాలేదు.
రాష్ట్రంలో మొత్తం కనెక్షన్లు 1.96 కోట్లు ఉండగా, వ్యవసాయ రంగంలో 27.99 లక్షల కనెెక్షన్లున్నాయి. మొత్తం విద్యుత్ విని యోగం 2023-24కు 84,156 మిలియన్ యూనిట్లు కాగా, వ్యవ సాయరంగానికి 19,810 మిలియన్ యూనిట్లు వినియోగించాలి. దీనిని ఉపసంహరిపంచేయటానికి అనేక ప్రయత్నాలు జరుగుతు న్నాయి. సకాలంలో విద్యుత్ సరఫరా లోపం వల్ల దాదాపు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ఆధారపడి ఉన్న మూడు లక్షల ఎకరాల్లో పం టలు ఎండిపోతున్నాయి. 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. డిస్కాంల ఆస్తవ్యవస్థ నిర్వహణ వల్ల ఏటా 700 మంది రైతులతో బాటు 1500 పశువులు మరణిస్తున్నట్లు ”విద్యుత్ రెగ్యులేటరీ కమి షన్” నివేదికలో వెల్లడిస్తున్నారు. ఇందులో దాదాపు సగం మంది తమ లోపాల వల్లనే చనిపోయారని వారికి పరిహారం ఇవ్వ డంలేదు. విద్యుత్‌రంగ బకాయిల గురించి చర్చించిన ప్రభు త్వం విద్యుత్ నిర్వహణలో అంతర్గత నైపుణ్యాన్ని పెంచుకోవ డానికి కనీస నిబంధనలు పాటించడం లేదు. 20, 30 సంవ త్సరాల క్రితం వేసిన కండక్టర్ వినియోగించడం వల్ల ప్రసా రంలో నష్టాలు వాటిల్లుతున్నాయి. సబ్ స్టేషన్‌లో నలుగురు సిబ్బంది పని చేయాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే ఉంటు న్నారు. రాష్ట్రంలో 8.79 లక్షల డిస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా వాటి నిర్వహణ ఆధ్వన్నంగా ఉంది. మెజార్టీ ట్రాన్స్ ఫార్మర్లకు ఒకటి ఎర్తింగ్, రెండవది ఏ.బి స్విచ్‌ల నిర్వహణ, మూడో పీడర్ కనెక్షన్లు సక్రమంగా లేకపోవడం. ఎప్పుడు ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోతుందో తెలియదు. పేలిపోయిన 15 రోజుల వరకు రిపేర్లు ఉండవు. డిస్కాంలలో అవినీతి పెద్ద ఎత్తున కొనసాగు తున్నది. కనెక్షన్ల కొరకు పెట్టుకున్న దరఖాస్తులు మంజూరీ కావడానికి 4,5 మాసాలు పడుతున్నది. 14 శాతం డిస్టిబ్యూషన్, ట్రాన్స్ మిషన్ నష్టాలతో నిర్వహణ సాగుతున్నట్లు నివేదిక చెప్తున్నది. వాస్తవానికి వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు లేకపోవడం వల్ల జరిగిన నష్టాలను వ్యవసాయరంగంపై తోసి వేస్తున్నారు. రాష్ట్రంలోని 3,221 సబ్ స్టేషన్‌లు (33/11 కె.వి) నిర్వహణ సక్రమంగా లేక చాలా సందర్భా లలో సబ్ స్టేషన్లు కాలిపోతున్నాయి. అయినా వాటిని సకాలంలో రిపేర్లు చేయడం లేదు.
విద్యుత్ కొనుగోలులో కుంభకోణం
2014 నవంబర్ 3న ఛత్తీస్‌గఢ్ నుండి 1000 మెగవాట్ల కొను గోలుకు పరస్పర ఒప్పందం కుదిరింది. 2017 మే 6 నుండి విద్యుత్ చక్తి ఉత్పత్తి చేసి ప్రసారం చేయడం జరిగింది. సహజంగా విద్యుత్ జనరేషన్ కేంద్రాలలో 75 శాతం ”ప్లాంట్ లోడ్ ప్యాక్టర్” (పిఎల్‌ఎఫ్) ఉత్పత్తి కావాలి. కానీ, ఛత్తీస్‌గఢ్‌లలో కొనుగోలు చేసిన 1000 మెగా వాట్లలో 2017-18లో 72.51 శాతం, 2018-19లో 64.39 శాతం, 2019-20లో 27.33 శాతం, 2020-21లో 39.7 శాతం, 2021-22లో 19.71 శాతం మాత్రమే ఉత్పత్తి అయింది. ఏప్రిల్ 21 నుండి ప్రసారం మొత్తం ఆగిపోయింది. విద్యుత్ ఉత్పత్తి కాకున్న ఆ సంస్థకు రూ.638.50 కోట్లు చెల్లించడం జరిగింది. అలాగే యా దాద్రి (4000 మెగావాట్లు) ఉత్పత్తి కేంద్రానికి మూల ధన వ్యయం 2015 జూన్ 1న రూ.25,099 కోట్లు మంజూరీ చేయగా, నేటి వరకు రివైజ్డ్ చేసి రూ.34,543 కోట్లకు పెంచడం జరిగింది. ఒక మెగావాట్లకు మొదట రూ.6.27 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.8.64 కోట్లకు పెంచారు. అదే సందర్భంలో ఎన్‌టిపిసి రామగుండంలో మెగావాటుకు రూ.7.63 కోట్లకు నిర్మాణం చేశారు. అలాగే భద్రాద్రి 4×270 మెగావాట్లు,మెగావాటుకు రూ.9.74 కోట్లకు పెంచారు. ఏడేండ్లు గడిచినా ఇంత వరకు పూర్తి కాలేదు.
రాష్ట్ర ఉత్పత్తి మొత్తం 6,485 మెగావాట్లు కాగా, వినియోగం 21,988 మెగావాట్లకు పెరిగింది. మన ఉత్పత్తి పోగా మిగిలిన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నాం. ఈ రోజు బహిరంగ మార్కెట్‌లో యూనిట్ రూ.3.64 రూపాయల నుండి రూ.4 లకు లభ్యం అవుతున్నది. కానీ, గత రాష్ట్ర ప్రభుత్వం 5,6 రూపాయల చొప్పున యూనిట్ కొనుగోలు చేసింది. ఒప్పందం కుదుర్చుకున్న తరువాత విద్యుత్ సరఫరా కాకున్న ఒప్పందం ప్రకారం కంపెనీలకు చెల్లించడం జరిగింది. రైతులకు, గృహాలకు సబ్సిడీ ఇవ్వ డం ద్వారానే నష్టం జరుగుతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి వంద యూనిట్ల లోపు వాడకం దారులకు రూ.1,381 కోట్లు, రైతు లకు 7,743 కోట్లు మొత్తం 9,124 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లిం చారు. అయినా ప్రతియేటా 12వేల కోట్లు ఆదాయ వ్యయాలలో తగ్గుదల ఉన్నట్లు డిస్కాంలు బహిరంగ విచారణలో నివేదికలు ఇస్తు న్నాయి. రెగ్యులేటరీ కమిషన్ ప్రతియేటా విద్యుత్ ఉత్పత్తిని, వినియో గాన్ని లెక్కగట్టి వినియోగదారుడు యూనిట్‌కు ఎంత చెల్లించాలో కెటగిరిల వారీగా నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని డిస్కాంలు అమలు జరపాలి. డిస్కాంలకు వచ్చే ఆదాయం నుండి ట్రాన్స్ మిషన్‌కు, జనరేషన్‌కు ఇచ్చుకోవాలి. కానీ, డిస్కాంలకు వచ్చిన ఆదాయంలో తా ము అదనంగా వాడుకుంటూ ట్రాన్స్ మిషన్‌లకు, జనరేషన్‌లకు బకా యిలు పెడుతున్నారు. 2018 నుండి 2022 మార్చి వరకు రెగ్యు లేటరి కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహించలేదు. ఆ నాలు గేండ్లలో 36 వేల కోట్లు లోటు వచ్చినట్లు బాకీలు చూపుతున్నాయి.
ఒకవైపున విద్యుత్ కొనుగోలులో తక్కువ ధరకు వచ్చే విద్యుత్ కొనకుండా, విద్యుత్ జనరేషన్ కేంద్రాలలో సకాలంలో నిర్మాణం చేయకుండా ఉండడం వల్ల నేడు విద్యుత్ సంస్థ రుణాలు ఉహిం చనంతగా రూ.81,516 కోట్లకు పెరిగాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల డిస్కాంల బాకీలను మాఫీ చేశారు. అయినా మరల బాకీలు పెరుగుతూనే ఉన్నాయి. విద్యుత్‌శాఖలోని 3 విభాగాలు అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా రుణాలను చెల్లించ డంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వవచ్చు. శ్వేత పత్రంలో ప్రకటించినట్లు జన్‌కో-ట్రాన్స్‌కో డిస్కాంలకు ప్రస్తుతం ఉన్న అప్పులకు సమానంగా ఆస్తులు ఉన్నట్లు నివేదించారు. డి స్కాంల ఆస్తులు రూ.59,132 కోట్లు కాగా, అప్పులు కూడా అంతే ఉన్నాయి. జెన్‌కోకు రూ.53.963 కోట్లు ఆస్తులు కాగా, అప్పులు కూ డా సమానంగా ఉన్నాయి. ట్రాన్స్‌కోకు రూ.24,476 కోట్లు ఆస్తులు ఉండగా అప్పులు సమానంగా ఉన్నాయి. 2014లో డిస్కాంల బాకీ 12,186 కోట్లు కాగా, 2023లో రూ.62,461 కోట్లకు పెరిగింది. నిర్వహణ లోపాలను ఈ అప్పులు స్పష్టంగా చెప్తున్నాయి. గత పదేం డ్లలో రాష్ట్రంలో 2000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అదనంగా ఉత్ప త్తి అయింది. నిర్మాణంలో ఉన్న ఉత్పత్తి కేంద్రాలు ఏళ్ళు గడిచినా పూర్తి కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంగా 4 వేల మెగావాట్లు ఉచితంగా నిర్మాణం చేసి ఇస్తానని చెప్పి మొదటి దశలో రామగుండంలో 1600 మెగావాట్లు నిర్మాణం పూర్తి చేసింది. రెండో దశలో మరో 800 మెగావాట్లు 2024కు పూర్తి చేస్తానని చెప్పింది. సౌర విద్యుత్ అభివృద్ధి కోసం సబ్సిడీ ఇచ్చినప్పటికీ నేటి వరకు 2,695 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరిగింది. కానీ, మరో 3 వేల మెగావాట్ల నిర్మాణాలు జరగాలి. ఇతర ప్రాంతాల నుండి 3000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాం. గ్యాస్ ద్వారా ఉత్పత్తి 2014లో 926 మెగావాట్లు కాగా నేడు 807 మెగవాట్లకు తగ్గింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి తక్కువ ఖర్చుతో అవుతున్నది. అలాగే సౌరశక్తి, తదితర పద్ధతులను వినియోగించి ఉత్పత్తి ఖర్చును తగ్గించవచ్చు. తెలంగాణలో పారిశ్రామీకరణకు తగి నంత విద్యుత్ సరఫరా చేయకపోవడం వల్ల పరిశ్రమల స్థాపనకు ఆటంకం ఏర్పడుతున్నది. వాటికి రూ.7-12ల వరకు యూనిట్ ధర నిర్ణయించడంతో ప్రభుత్వ సంస్థల నుండి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తూ సొంత క్యాపిటేషన్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. క్రాస్ సబ్సిడీ లేకుండా వ్యవసాయం, 100 యూనిట్లలోపు వారికి సబ్సిడీ ఇవ్వడం సాధ్యం కాదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు మాఫీ ప్రకటించింది. దాని వల్ల రాష్ట్రంలోని 1.05 కోట్ల కనె క్షన్లకు రూ.3,431 కోట్లు సబ్సిడీ చెల్లించాల్సి వస్తుంది. వీరికి 9,021 మిలియన్ యూనిట్లు అవ సరం ఉంటుందని అంచనా వేశారు. అందువల్ల రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి, అంతర్గత సామ ర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేయకుండా రుణాలపైననే చర్చలు జరిపి సంతృప్తి చెందడం వల్ల ఉత్పత్తి పెరగదు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందదు. ఈ అంశాలను సమగ్రంగా చర్చించి ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666