స్వతంత్ర వార్తా పోర్టల్ న్యూస్‌క్లిక్ పై మోడీ ప్రభుత్వం వరుసదాడులు చే స్తున్న తీరు అత్యంత దుర్మార్గం. అక్టోబర్ లో ఆ సంస్థ ఎడిటర్ ప్రబీర్ పుర్కా యస్థ, హెచ్ఆర్ విభాగం అధిపతి అ మిత్ చక్రవర్తిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆ సంస్థ బ్యాంకు ఖాతాలను స్థంభింప చేసింది. ఏ మాత్రం ముందస్తు హెచ్చ రికలు లేకుండా తీసుకున్న ఈ చర్యతో రోజువారీ వ్యవహారాలకు కూడా వెతు క్కోవాల్సిన దుస్థితి ఆ సంస్థకు ఏర్ప డింది. ఇక పాత్రికేయులు, వీడియో గ్రాఫర్లు, కార్యాలయ సిబ్బంది, కంట్రి బ్యూటర్ల జీతాల సంగతి చెప్పనవసరం లేదు. నిజానికి వారికి చెల్లింపులు చేయ డానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ అధికారులు ఫ్రీజ్ చేసిన విషయం వెల్ల డైంది. తిరిగి ఖాతాలను ఎప్పటి నుండి పునరుద్ధరిస్తారన్న అంశాన్ని కూడా ఐటి అధికారులు చెప్పకపోవడంతో అగమ్య గోచర పరిస్థితి ఏర్పడింది. క్రిస్మస్, నూ తన సంవత్సరంతో పాటు సంక్రాంతి పండగల వేళ మోడీ ప్రభుత్వం తీసు కున్న ఈ చర్య జీతాల మీదనే ఆధార పడి, బతుకులీడ్చే కుటుంబాల్లో ఏ స్థా యిలో బాధను నింపుతుందో ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు. అయినా ఈ షాక్ నుండి తొందరగానే బయటపడిన న్యూస్ క్లిక్ సిబ్బంది, ఈ తరహా చర్యలు తమ మనోధైర్యాన్ని, అంకితభావాన్ని అణువంత కూడా తగ్గించలేవని, తమ శక్తినంతా ఉపయోగించి చివరి వరకు పని చేస్తామని ప్రకటించడం స్ఫూర్తి దాయకం.
మోడీ ప్రభుత్వం రెండవసారి అధి కారంలోకి వచ్చినప్పటి నుండి న్యూస్‌క్లిక్ పై దేశద్రోహ ముద్ర వేయడానికి ప్రయ త్నాలు చేస్తూనే ఉంది. 2021 లోనే ఇడి, ఇన్‌కంట్యాక్స్ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసులనూ రంగంలోకి దించిం ది. రకరకాల ప్రభుత్వ ఏజెన్సీలు రోజుల తరబడి విచారణ చేశాయి. అయినా, చైనా నిధులంటూ చేస్తున్న ఆరోపణ లను కేంద్ర ప్రభుత్వం వీసమంత కూడా నిరూపించలేకపోయింది. న్యూయార్క్ టైమ్స్ అదే ఆరోపణ చేస్తూ ప్రచురించిన బూటకపు కథనాన్ని అడ్డు పెట్టుకుని ఉపా చట్టం కింద అరెస్ట్‌లు చేసింది. అ రెస్ట్లలు చేసి నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఛార్జిషీట్ కూడా దాఖలు చేయ లేదు. మరోవైపు తనకు వచ్చే నిధులన్నీ భారతీయ చట్టాలకు లోబడి, రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకు అకౌంట్ల ద్వారానే వస్తాయని న్యూస్‌క్లిక్ పదేపదే స్పష్టం చేస్తోంది. ఇప్పుడు ఆ ఖాతాలను స్తంభింపచేయడం ద్వారా గొంతు నులమడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు దాడులు, అ రెస్ట్లు జరిగినా న్యూస్‌క్లిక్ కార్యక్రమాలు స్థిరంగా సాగుతున్నాయి. ఉద్యోగులు మొక్కవోని దీక్షతో సంస్థను ఎప్పటి మాదిరే ముందుకు తీసుకువెళ్ళారు. కర డుగట్టిన ఆర్థిక నేరగాళ్ల విషయంలోనూ లేని విధంగా బ్యాంకు ఖాతాలను స్తం భింపచేసే దుర్మార్గానికి మోడీ సర్కారు తెగబడింది. ప్రభుత్వం అనుకున్న విధం గా జరిగితే న్యూస్ క్లిక్కు ఇది ప్రాణాం తకంగా మారే ప్రమాదం ఉందన్న వాద నలు వినిపిస్తున్నాయి. దీన్ని గుర్తించే ఆ సంస్థ ఉద్యోగులు తమకు అండగా నిల వాలని పౌర సమాజానికి విజ్ఞప్తి చేశా రు. ఆ దిశలో ముందడుగు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత.
దేశ వ్యాప్తంగా ఉన్న మేధావులను, ప్రజాతంత్ర వాదులను ‘ఉపా’ చట్టం కింద అరెస్ట్‌చేసి, నాలుగేళ్లుగా నిర్బంధం లో ఉంచినప్పటికీ ఇప్పటివరకు ఒక్క ఆధారాన్ని కూడా మోడీ సర్కారు చూప లేకపోయింది. అటువంటి కుట్రే న్యూస ్క్లిక్పై కేంద్రం చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ది ఎకానమిస్ట్’ పత్రిక భా రత ప్రజాస్వామ్య స్తంభాలను ఒక్కొక్క టిగా కూల గొడుతున్నారు’ అని రాసిం ది. అది అక్షరాల నిజం! ఈ ధోరణిని ఇక ఏమాత్రం అనుమతించ కూడదు. ప్రత్యామ్నాయ మీడియా సంస్థలను అణచివేయడం ద్వారా ప్రజల గొంతు నొక్కడానికి, ప్రజాస్వామ్యాన్ని కూల్చ డానికి జరుగుతున్న ప్రయత్నాలను గట్టిగా ప్రతిఘటించాలి.. తిప్పికొట్టాలి.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్