సీఎంకు కృతజ్ఞతలు : ఏజీ సంజీవరావు, ఈఎన్సీ

పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖకు భారీగా పోస్టులు మంజూరు చేసినందుకుగాను ఈఎన్సీ ఏజీ సంజీవరావు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ మరింత మెరుగ్గా నిర్వహంచి సీఎం గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖ ప్రధాన కార్యాలయంలో ఇంజినీర్లు, ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈఎన్సీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోస్టులు మంజూరయ్యాయని చెప్పారు. నేను ఈఎన్సీగా ఉన్నప్పుడు శాఖను పూర్తిస్థాయిలో పునర్వ్యవ్యవస్థీకరణకు చేయడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇందుకు సహకరించిన మంత్రులు హరీశ్‌రావు, దయాకర్‌రావు, ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ , ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఏ.శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, సుల్తానీయా, సీఎంవో కార్యదర్శి స్మీతా సభర్వాల్‌ తదితరులకు దన్యవాదాలు తెలియజేశారు. కార్యాలయంలో ఇంజినీర్లు, ఉద్యోగులు టపాసులు పేల్చారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో సీఈ జి సీతారాములు, ఎస్‌ఈలు అశోక్‌, ఎం. సురేశ్‌, ఈఈ డి రమేశ్‌కుమార్‌, బిశ్రీహరి, ఏటీఎంఎ ముజీబ్‌, డిప్యూటీ ఈఈ అబ్బు శ్రీనివాస్‌, టీఎస్‌పీఆర్‌ఈఏ ఉపాధ్యక్షులు జి.నరేంద్రప్రసాద్‌, పి చంద్రమౌళి, ఎం. భూమన్న, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.