పేద ప్రజలకు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగల్ గావ్ గ్రామములోని గ్రామ సర్పంచ్ కపిల్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు వైద్యపరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ కు చెందిన పలువురు వైద్య సిబ్బంది పాల్గోన్నారు. యాబై రకాల వ్యాదులకు సంభందించిన  వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగింది.  గ్రామములోని ప్రతి ఒక్కరు ఉచిత వైద్య పరీక్షలు చేసుకోని సద్వినియేాగం చేసుకోవాలని తెలిపారు.  అంతకు ముందు ఉచిత వైద్య శిభిరాన్ని  సర్పంచ్ కపిల్ పటేల్ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు , సిఎస్సీ  వైద్య బృందం తదితరులు పాల్గోన్నారు.