– జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-మల్హర్రావు
తాడిచెర్ల ఆర్అండ్ఆర్ కాలనీలో మౌలిక వసతుల కల్ప న పనుల్లో వేగం పెంచి జూన్ చివరి లోగా పూర్తి చేసి నిర్వా సితులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబం ధింత అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని కాపురం, తాడిచర్ల గ్రామాల్లోని జెన్కో, డిస్కం భూ నిర్వాసితులకు కేటాయించిన ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. ఆర్ అండ్ఆర్ కాలనీలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పన కోసం నిధులు మంజూరు చేసిందని, కాలనీలో అవసరమైన సిసి రోడ్లు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ కల్పన పనులు జూన్ చివరిలోగా పూర్తి చేయాలని ఆదేశిం చారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుండి త్వరలోనే పరి హారం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న నీటి ట్యాంకు ద్వారా తాగునీటి పైప్ లైన్లు టెస్టింగ్ జరిపి కాలనీలో చివరి ఇంటి వరకు నీరు సమృద్ధిగా, లీకేజీలు లేకుండా సరఫరా జరిగేలా చూడా లన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో ఉన్న అన్ని వర్గాల వారికి ప్రార్థన స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరా బాద్ నగరంలోని టౌన్ షిప్ ప్రమాణాలు మేరకు ఆర్ అండ్ ఆర్ కాలనీలో అంగన్వాడీ సెంటర్ ,ప్రాథమిక పాఠశాల, పీహెచ్సీ సబ్ సెంటర్ మొదలగు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులకు ఏమైనా అవ సరాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్క రిస్తామని చెప్పారు. అనంతరం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయ పనులు పూర్తి కాగా సందర్శించి త్వరలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో తీగల వాగు ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, తహశీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి, అవినాష్, ఎం.పి.డి.ఓ. నరసింహమూర్తి, ఎంపిటిసి రావుల కల్పన మొగిలి, కంపెనీ ప్రతినిధి మల్లేష్, పంచాయతీరాజ్ మిషన్ భగీరథ అధికారులు విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.