పీ ఆర్ టీ యూ క్యాలెండర్ ఆవిష్కరణ     

నవతెలంగాణ – ధర్మసాగర్ 
మండల కేంద్రం ధర్మసాగర్ లోని మండల విద్యా వనరుల కేంద్రంలో పీఆర్ టీ యూ తెలంగాణ క్యాలెండర్ ను  హనుమకొండ జిల్లా అధ్యక్షులు భీమోజు రాజేశ్వరయ్య చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి రావులకారు వెంకటేష్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భీమోజు రాజేశ్వరయ్య చారి మాట్లాడుతూ పీఆర్ టీ యూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగుల  సమస్యల పరిష్కారానికి పీఆర్ టీ యూ తెలంగాణ రాష్ట్ర, జిల్లా నాయకత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. పాఠశాల విద్యా కార్యక్రమాల విజయవంతానికి కృషి చేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అని అతని సారథ్యంలో  విద్యారంగ సమస్యలను,సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పిఆర్టియు-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఎమ్మార్సి సిబ్బంది మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.