గాలి, వాన భీభత్సం

– నెలకొరిగిన వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండల పరిధిలో గురువారం మధ్యాహ్నం గాలి, వాన భీభత్సం సృష్టించాయి. ఉదయం మంచి భానుడి ప్రతాపానికి అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈదరు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో పలుచోట్ల ఇళ్లపైకప్పు లేచి పోయాయి. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే మోరంప ల్లిబంజర-బూర్గంపాడు-సారపాక ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నెలకొరగడంతో రాక పోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఉక్క పోతతో చిన్న పిల్లలు, పెద్దలు అల్లాడిపోయారు.