ఎమ్మెల్యే మెచ్చా ఇంటిని ముట్టడించిన జీపీ కార్మికులు

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన జీపీ కార్మికులు
ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన జీపీ కార్మికులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామ పంచాయితీ కార్మిక సంఘం రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపులో నేపధ్యంలో  చేపట్టిన జీపీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరింది. రోజు వారీ నిరసనల భాగంగా మంగళవారం స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఇంటిని అశ్వారావుపేట, ములకలపల్లి గ్రామ పంచాయితీ కార్మికులు ముట్టడించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీపీ కార్మికుల  సమస్యలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ దృష్టికి, ముఖ్యమంత్రి  కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు,కార్మికులు పాల్గొన్నారు.
Spread the love