ఎంసెట్‌ ఫలితాలలో 98వ ర్యాంకుతో న్యూ విజన్‌ అగ్రస్థానం

నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్‌
ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎంసెట్‌ – 2023 పోటీ పరీక్షలో ఖమ్మం నగరంలో న్యూ విజన్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ర్యాంకులతో ప్రభంజనాన్ని సృష్టించింది. రాష్ట్ర స్థాయిలో 98, 120, 129, 174, 196, 249, 337, 364, 386, 387, 396, 436, 437 వంటి మరెన్నో ఉత్తమ ర్యాంకులతో జిల్లాలోనే నెంబర్‌ వన్‌ స్థాయిలోనే కాక రాష్ట్రస్థాయిలోనూ నెంబర్‌ వన్‌ కళాశాలగా న్యూ విజన్‌ నిల్చిందని కళాశాల చైర్మన్‌ సి.హెచ్‌.జి.కె. ప్రసాద్‌ తెలిపారు. తమ కళాశాల నుండి ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగంలో జి. నీరజ రెడ్డి – 98 ర్యాంకు, ఎం.సుష్మ శ్రీ – 120 ర్యాంకు, బి.ధనుష్‌ -129 ర్యాంకు, బి.రిత్విక్‌ – 174 ర్యాంకు, కే.భవ్య – 196 ర్యాంకు, వి.వెంకట సత్తివీక్‌ – 249 ర్యాంకు, డి.సాయి శ్రీ రామ్‌-337 ర్యాంకు, కే.యశ్వంత్‌ -364 ర్యాంకు, పి.వరుణ్‌ -386 ర్యాంకు, పి.రాహుల్‌ -387 ర్యాంకు, కే.హర్షిత శ్రీ -396 ర్యాంకు, టి.జాస్మిత -436 ర్యాంకు, పి.వి చాణిక్య -437ర్యాంకు, సోబియా తనజ్‌ ఆలీ – 551 ర్యాంకు, పి రోహిత్‌ సాయిఅన్వేష్‌ -571 ర్యాంకు, పి.రోహిత్‌ – 618 ర్యాంకు, ఆర్‌. విష్ణు నాగ నితిన్‌ -623 ర్యాంకు, పూభయంద్ర -688 ర్యాంకు, కే.కామలీక -739 ర్యాంకు, పి .మురారి-756 ర్యాంకు, పి. బిలవన -792 ర్యాంకు, కే.లిఖిత పవన్‌ -835 ర్యాంకు, యం. దేనా తేజ -905 ర్యాంకు, టి. చేతన్‌ – 920 ర్యాంకు, ఎస్‌.కె .మెహెతాబ్‌ -970 ర్యాంకు, గణేష్‌ సాల్‌ -981ర్యాంకు, కే. కౌశిక్‌ -1367, పి. రేణు -1418, వి. శ్రీ హర్షిత – 1446, ఎన్‌. ఉడిత్‌ చౌదరి – 1475, సిహెచ్‌. సత్యనారాయణ – 1492 వంటి మరెన్నో ర్యాంకులు సాధించారని న్యూ విజన్‌ జూనియర్‌ కళాశాల చైర్మన్‌ సి.హెచ్‌.జి.కె. ప్రసాద్‌ తెలిపారు. ఇంజనీరింగ్‌ విభాగం నుండి 450 మంది, అగ్రికల్చర్‌ విభాగం నుండి 80 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 10,000 లోపు 210 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు.
జె.ఈ.ఈ. మెయిన్స్‌ ఫలితాలలో ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరిలో 254 వ ర్యాంకు 99.9854109 ఉత్తమ పర్సెంటైల్‌తో ఆలిండియా ర్యాంకులను కైవసం చేసుకున్న. న్యూవిజన్‌ అదే ఒరవడిని కొనసాగిస్తూ ఎంసెట్‌ 2023 ఫలితాలలో కూడా రాష్ట్రస్థాయి అత్యుత్తమ ర్యాంకులను పొందడం మేము అందిస్తున్న ఉత్తమ శిక్షణను ప్రభల తార్కాణమని తెలిపారు. రాబోయే నీట్‌, అడ్వాన్స్డ్‌ ఫలితాలలో కూడా తమ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పరిమిత సంఖ్యగల విద్యార్థులతో న్యూ విజన్‌ కళాశాల విద్యార్థులు వారిదైనా ప్రతిభ చూపి మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అందుకు సహకరించిన తల్లిదండ్రులను న్యూ విజన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ సి. హెచ్‌.జి.కె. ప్రసాద్‌, డైరక్టర్‌ సి. హెచ్‌. గోపిచంద్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ సి. హెచ్‌. కార్తిక్‌, అభినందించారు.