నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఐజీసీఎస్ఈ-2023 ఫలితాల్లో తమ విద్యార్థులు విజయం సాధించారని నాచారం డీపీఎస్ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ యాజమాన్యం గురువారం ప్రకటిం చింది. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆ సంస్థ చైర్మెన్ మల్కా కొమ రయ్య, డైరెక్టర్ పల్లవి, సీవోవో మల్కా యశస్వి, సీనియర్ ప్రిన్సిపాల్ సునీతా రావు, కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రిన్సిపాల్ ఎంఎఫ్ శాంతి ఆంథోనీ అభినం దించారు. ఆరు సబ్జెక్టుల్లో శ్రీరామ్, శ్రీగిరి స్టార్ సాధించారని వెల్లడించారు.