పెరియో గడ్డి మందు కొనుగోలు పై స్వాల్ కంపెనీ అందిస్తున్న ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని రైతులు సభ్యునియోగం చేసుకోవాలని కమ్మర్ పల్లి సింగిల్ విండో చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద స్వాల్ కంపెనీ వారి పెరియో గడ్డి మందును ఆయన పలువురు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాల్వ్ కంపెనీ పెరియో గడ్డి మందు ఒక లీటర్ బాటిల్ పై రూ. లక్ష ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం రైతులకు కల్పించడం జరుగుతుందన్నారు. రైతులు ఈ సదవకశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు మేలు చేసే విధంగా సాల్వ్ కంపెనీవారు కొత్త కొత్త ఉత్పత్తుల తయారుచేసి రైతులకు అందుబాటులో తీసుకురావడంతో పాటు కొత్త కొత్త పథకాలను రైతులకు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా కేక్ కట్ చేసి, పదిమంది రైతులకు, డైరెక్టర్లకు ఉచిత ప్రమాద భీమ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కంపెనీ వారి ఆధ్వర్యంలో ఫెరియో గడ్డి మందు వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం సింగిల్ విండో డైరెక్టర్లు రేంజర్ల మహేందర్, తీగల హరీష్, కొత్తపల్లి అశోక్, బద్దం రాజశేఖర్, ఎనేడ్ల రవీందర్, రైతులు అవారి గంగారెడ్డి, చిలుకూరి సురేష్, అవారి శీను, చిలుకూరు మారుతి, దుంపల శ్రీనివాస్, జిన్న రమేష్, తదితరులు పాల్గొన్నారు.