గోదావరి వరదలపై ప్రణాళిక లేని ప్రభుత్వం

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు రవికుమార్‌
నవతెలంగాణ-వాజేడు
గోదావరి వరదల పై ప్రభుత్వానికి ప్రణాళిక, ముందుచూపు లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ అన్నారు. శుక్రవారం మండపాక హరిత హౌటల్‌లో జిల్లాకమిటి, దబ్బకట్ల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశం లో రవికుమార్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరి వరదల పై నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాయని అన్నారు. పోలవరం బ్యాక్‌ వాటర్‌, వర్షాకాలం లో వర్షపాతం ఎక్కువగా వుండటం వల్ల వాజేడు మండలంలో గత సంవత్సరం వరదలలో 13 గ్రామాలు ముంపునకు గురికాగా,30 గ్రామాలకు రహదారి, విద్యుత్తు సౌకర్యాలు లేక వరదల సమయంలో ప్రజలు అనేక ఇబ్బం దులు పడ్డారని అన్నారు. ముంపునకు గురైన ప్రజలను పునరావాస కేంద్రాలకులకు తరలించేందుకు సౌకర్యల కల్పించటంలో ప్రభుత్వం అధికారులు అంటి ముట్టనట్లు వ్యవహారించారని అన్నారు. కుండపోత వర్షం లో బరకాలే ఆధారం అయ్యాయని, ముంపు ప్రజలకు సౌకర్యాలు కల్పిం చటం లో,స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు నియోజకవర్గ కేంద్రాలకే పరిమితమయ్యారని విమర్శించారు. నేటి వరకు ముంపు ప్రజలకు పునరావాస సహాయం అందివ్వటం లో ప్రభుత్వం, ఎమ్మెల్యే, ఎంపీలు పట్టించుకోలేదని, ప్రజలు ప్రభుత్వ కార్యా లయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. అయినా నేటివ రకు పునరావాసం పూర్తిస్థాయిలో ఇవ్వలేదని అన్నారు. గత వరదలను దష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, అధికారులు ముం దస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం సూడి కష్ణారెడ్డి మాట్లాడారు. సీపీఐ(ఎం), తెలంగాణ ఆది వాసీ గిరిజన సంఘం, ఆధ్వర్యంలో పోరాడి తునికాకు బోనస్‌ నిధులు సాధించుకుంటే, అధికారులు పంపిణిలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని, రాష్ట్రంలో ఆసిఫాబాద్‌, ఆది లాబాద్‌ జిల్లాలో ఇప్పటికే పంపిణి ప్రారంభమైందని, ము లుగు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కరి ఖాతాలో రూపాయి బోనస్‌ కూడా పడలేదని, ఫారెస్ట్‌ అధికారులు ఇకనైనా స్పందించి తునికాకు బోనస్‌ నిధులు పంపిణికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, నాయకులు బీరెడ్డి సాంబాశివా, రాజేందర్‌, కొప్పుల రఘుపతిరావు, కుమ్మరి శ్రీను,గ్యానం వాసు, పొందిల్లా చిట్టిబాబు, గొంది రాజేష్‌, దుగ్గి చిరంజీవి, ఎండీ దావుదు, చిన్న,బచ్చల కష్ణబాబు తదితరలు పాల్గొన్నారు.