నవతెలంగాణ-మల్హర్‌రావు
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పదేకరాల నిలువు వరిపంటలు బుగ్గిపాలైన సంఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల, బాధిత రైతులు రంగు సంపత్, కామ వెంకటేష్,మంథని సారయ్య,తోట రమేష్ పూర్తి కథనం ప్రకారం ఆరుగాలం కష్టపడి లక్షల పెట్టుబడులు పెట్టి కోతకొచ్చిన దశలో (ప్రమాదవశాత్తు) అకస్మాత్తుగా పొలాల్లో మంటలు చెలరేగి నిలువున్న పదేకరాల వరిపంటలు అగ్నికి ఆహుతైయ్యాయని కన్నీరుమున్నీరైయ్యారు.రేపోమాపో కొస్తామనుకునే నిండుగా వరిగింజలున్న పొలాలు మంటల్లో కాలిపోవడంతో తమకు దాదాపు రూ.10 లక్షల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకొంటున్నారు.లేదంటే తమ బతుకులు రోడ్డుపాలై ఆత్మహత్యలే చర్యన్యమని వాపోయారు.