రోడ్డుపై కంకర పోశారు… బీటీ మరిచారు…

– కంకరతో నరకయాతన పడుతున్న వాహనదారులు, పాదచారులు
– ఈరెంటీ నుండి కంచనపల్లి వరకు12.100
నవతెలంగాణ-పాలకుర్తి రూరల్‌
పిఎంజిఎస్‌వై నిధులు 1043.10 లక్షల రూపాయల అంచనాతో రోడ్డు విస్తరణ పనులు చేయుటకు గత సంవత్సరం అక్టోబర్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీ లు పసునూరి దయాకర్‌, బండ ప్రకాష్‌లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈరెంటీ నుండి గబ్బెట వరకు రోడ్డు విస్తరణ చేసి కంకరపరిచారు. గత రెండున్నర సంవత్సరా లుగా అదే కంకరపై వాహనదారులు,ద్విచక్ర వాహనదారులు పాదచారులు అనేక ఇబ్బం దులను ఎదుర్కొంటున్నారు. కోతులబాధ గ్రామంలోని ప్రజలు, రైతులు ఊరిలోనికి కిరా యికి ఏ వాహనాలు రావడం లేదు అంటున్నారు. అత్యవసర సమయంలో ఆటోలు కూ డా ఊర్లోకిరావడానికి జంకుతున్నారని ఆవేదన చెందుతున్నారు. వైద్యులు, బ్యాంకు అధి కారులు కూడా గ్రామంలోనికి రావడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలకు కొత్తటైర్లు వేసినప్పటికీరోడ్డుపై తేలిన కంకరకు టైర్లన్నీ కొద్దికాలంలోనే పాడైపోతున్నా యని అంటున్నారు. ఇట్టి కంకర రోడ్డు కంటే మట్టి రోడ్డు ఉంటే బాగుండేదని రోడ్డు వెం టపోయే ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత కాం ట్రాక్టర్‌తో రోడ్డుపై వేసిన కంకరపై వెంటనే బీటీ రోడ్డుపూర్తి చేయాలని సంబంధిత గ్రా మాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత పంచాయతీ రాజ్‌ డీఈ రామలింగయ్యచారిని పలుమార్లు పోన్‌లో సంప్రదించగా స్పందిచలేదు.
కంకర వేసి మూడు సంవత్సరాలు అయితాంది :బొక్క యాదయ్య, రైతు
రోడ్డు కంకర వేసి మూడేళ్లు అయితాంది.
ఊర్లో నుండి బయటకి పోవాలంటే గండంగా ఉంది.
కంకర రోడ్డు వల్ల ఊర్లోకి బ్యాంకు వారు, డాక్టర్లు రావడం లేదు.
పంట మార్కెట్‌కి పోవాలన్నా ఇబ్బంది కరంగా ఉంది.
రైతులు పండించిన పంట మార్కెట్‌కు పోవాలన్న ఇబ్బంది : ఏనుగు వెంకట్‌ రెడ్డి
ట్రాక్టర్లు కిరాయికి రానంటున్నారు. సొంత ట్రాక్టర్లు ఉన్న రైతుల కు మాత్రం ఇబ్బంది లేకపోగా లేని వారికి చాలా ఇబ్బందిగా ఉంది.
బైకు కొత్త టైర్లు వేస్తే మూడు నెలలు రావడం లేదు.
దీనితో జనగాం మార్కెట్‌కు పోవాలన్నా గానీ గబ్బెట నాలుగు కిలోమీటర్లు వరకు కంకర ఉండడం వల్ల రైతులు నరకయాతన పడుతున్నారు.
సంబంధిత కాంట్రాక్టర్‌ పై తగు చర్య తీసుకోవాలి :ఎదునూరి మదర్‌, ప్రజాసంఘాల నాయకులు
మూడు సంవత్సరాలుగా రోడ్డుపై కంకర వేసి నిర్లక్ష్యంగా వ్యవ హిరిస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌ పై ప్రభుత్వం వెంటనే తగు చర్య తీసుకొని రోడ్డు మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలి.
ఏడు కిలోమీటర్ల దూరం కంకరతో రోడ్డు ఉండడంతో జనం ఆ రోడ్డుకు పోవాలంటే భయప డుతున్నారు.
మరీ ముఖ్యంగా రోడ్డు వెంట ఉన్న గ్రామాలైన కోతల బాధ, రామన్నగూ డెం, గబ్బెట గ్రామాల వారు నరక యాతన అనుభవిస్తున్నారు.
వ్యవసాయ పనులకు పోవుటకు ఇబ్బంది అవుతుంది :గాదరి లక్ష్మి, మహిళా రైతు, ఈరెంటీ
వ్యవసాయ పనులకు బావుల కాడికి పోవుటకు ఇబ్బంది అవు తుంది.
వరి కోతకు, వడ్లు తెచ్చుటకు ట్రాక్టర్లు పొలం కాడికి రావడం లేదు.
రోజు పొలం పనులకు పోవాలన్నా నిత్యం రాళ్ల మీద నడిచిన ట్లు అవుతుంది.
కంకరతో వాహనాల ప్రమాదాలు కూడా జరుగుతు న్నాయి. వెంటనే రోడ్డు పనులు మొదలుపెట్టి రోడ్డు బాగు చేయాలి.