హైదరాబాద్‌లో స్టీల్‌కేస్‌ డీలర్‌షిప్‌ ప్రారంభం

సీటింగ్‌ వరల్డ్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు
హైదరాబాద్‌ : అంతర్జాతీయ ఫర్నీచర్‌ ఉత్పత్తుల తయారీ, రిటైలర్‌ అయినా స్టీల్‌కేస్‌ హైదరాబాద్‌లో తన నూతన డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. దీన్ని సీటింగ్‌ వరల్డ్‌ భాగస్వామ్యంతో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. జూబ్లిహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌ను శుక్రవారం స్టీల్‌కేస్‌ ఆసియా, పసిఫిక్‌ ప్రెసిడెంట్‌ ఉలి గ్వినెర్‌, సీటింగ్‌ వరల్డ్‌ రాజేష్‌ మంగ్హ్నాని లాంచనంగా ప్రారంభించారు.