మనం సహజంగా పండ్లను ఏ విధంగా తింటాం.. చాలా వరకు భోజనం చేసిన తర్వాతనే కదా.. అంతేకాదు, మన ఊర్లలో అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు రుచి కోసం పెరుగున్నంలో మామిడి, అరటి పండ్ల వంటివి కలిపి తినిపిస్తుంటారు. కానీ ఇలా తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఈ మధ్య కనుగొన్నది కాదు, దశబ్దాల కిందటే ప్రయోగాలు చేసి నిరూపించిన అక్షర సత్యం. అంతేకాదు, పరగడుపున అంటే ఖాళీ కడుపుతో పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే చాలా రకాల అనారోగ్యాలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని పండ్లను ఎలా తినాలో, ఎందుకు తినాలో తెలుసుకుందాం…
పండ్లను తినడం అంటే.. మార్కెట్‌కు వెళ్ళి మనకు నచ్చిన పండ్లను కొనుక్కొని వచ్చి, శుభ్రంగా కడిగి కట్ చేసి తినడమే కదా అనుకుంటాం. కానీ అది అనుకున్నంత సులువు కాదు. పండ్లను తినడం ఎప్పుడు ఎలా అనేది చాలా ముఖ్యం.
సరైన పద్ధతి ఏంటి?
భోజనం తర్వాత పండ్లను తినొద్దు. పండ్లను ఖాళీ కడుపుతోనే తినాలి. ఎందుకంటే.. ఖాళీ కడుపుతో తింటే, జీర్ణవ్యవస్థ విషతుల్యం కాకుండా కాపాడుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, బరువు పెరగకుండా కాపాడడంతో పాటు కొన్ని రకాల మేలు చేస్తుంది.
ముఖ్యమైన ఆహారం
మనం ఆహారం లేదా మరే ఇతర పదార్థాలతో పాటైనా పండ్లను తీసుకున్నామనుకోండి.. ఆ పదార్థం పూర్తి స్థాయిలో జీర్ణం అవడంలో అవరోధాలు ఏర్పడతాయి. దానర్థం ఆహారంతో పాటు మన కడుపులోకి వెళ్ళిన పండ్లు యాసిడ్‌గా మారి పూర్తి స్థాయిలో ఆహారాన్ని జీర్ణం కానివ్వదు. పండును మరో పదార్థంతో కలిపి తినడం వల్ల గ్యాస్ ఉత్పత్తి అయి, పొట్ట అంతా గందరగోళ పరుస్తుంది. పండ్ల ముక్కలు నేరుగా లేదా, జ్యూస్‌గా తీసుకుంటే ఇవి పేగులోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. దీని వల్ల పేగుల్లో నిల్వ ఉండే ఆహారాన్ని సైతం జీర్ణం చేస్తాయి. లేదంటే ఆహారాన్ని జీర్ణం చేసేందుకు అవసరమైన యాసిడ్‌లను తయారు చేస్తాయి. కాబట్టి పండ్లను ఖాళీ కడుపుతోనే తినాలి. లేదంటే భోజనానికి కొంత సమయం ముందు తినాలి. పండ్లను సరైన పద్ధతిలో తింటే అందం, ఆయుష్షు, ఆరోగ్యం, శక్తి, సంతోషం, సాధారణ బరువు వంటివి మన సొంతమవుతాయి. పండ్ల రసాలు తాగాలనుకుంటే, తాజా పండ్ల రసాలను మాత్రమే తాగాలి. పాకెట్లలో, బాటిళ్ళలో అందుబాటులో ఉండే వాటిని తాగొద్దు.
ఏర్పడే సమస్యలు
చాలా మంది చాలా రకాలుగా ఫిర్యాదులు చేస్తుంటారు. ‘నేను పుచ్చకాయ తినగానే కడుపులో నుంచి గాలి నోటి ద్వారా బయటకు వస్తోంది, పనస పండు తినగానే పొట్ట ఎత్తుగా అయింది, అరటిపండు తినగానే బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తోంది’ వంటివి సర్వసాధారణంగా వినిపిస్తుంటాయి. కానీ ఖాళీ కడుపుతో పండ్లు తింటే ఇలాంటి సమస్యలు దరిచేరవు. వెంట్రుకలు ఎరుపు రంగులోకి మారడం, బట్టతల రావడం, కడుపు ఉబ్బడం, కండ్ల కింద నల్లటి వలయాలు రావడం వంటివి ఖాళీ కడుపుతో కాకుండా పండ్లను ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకపోవడం వల్లనే ఏర్పడతాయి.
ఎన్నో పరిశోధనల ఫలితంగా..
డాక్టర్ స్టీఫెన్ మాక్ కాన్సర్ బాధితులను ఒక పద్ధతిలో బాగు చేశారు. సోలార్ శక్తిని ఉపయోగించకముందు ఆయన సహజ వైద్యాన్ని ఉపయోగించి అనారోగ్యాలను నయం చేశారు. ‘క్యాన్సర్‌ను బాగు చేయడంలో దాదాపు 80 శాతం విజయం సాధించాను. రోజూ పండ్లను తింటే క్యాన్సర్ బాధితులు చనిపోరు’ అని ఆయన వెల్లడించారు. డాక్టర్ హెర్బెర్ట్ హెల్టాన్ చేసిన పరిశోధనల ఆధారంగా వాస్తవానికి నిమ్మ, నారింజ వంటి పండ్లు ఆమ్లత్వం కలిగినవి కావు, అవి మన పొట్టలోనే ఆల్కలీన్‌గా మారతాయని నిరూపించారు.
వేడిచేసిన పానీయాలు తాగొద్దు
ఉడికించిన పండ్లను తినకూడదు. ఎందుకంటే, వాటిలో ఉంటే సహజత్వం, పోషకాలు ఆ తర్వాత ఉండవు. అలా చేయడం వల్ల వాటి రుచి మాత్రమే పొందగలుగుతాం. వండే క్రమంలో వాటిలోని విటమిన్లు కనుమరుగవుతాయి. రసాలు తయారు చేసుకోవడం కంటే, పండును నేరుగా తినడం ఇంకా ఉత్తమం. తాజా పండ్ల రసాలు తాగేపుడు మెల్లగా తాగాలి. నోటిలో ఉండే లాలాజలాన్ని కూడా కలిపి మింగడం వల్ల ఉపయోగం ఉంటుంది. తాజా పండ్లను తీసుకుంటే శరీరంలో ఉండే విషతుల్యాలన్నీ విసర్జితమై, చర్మం కాంతులీనుతుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
కివీ పండు : చూడడానికి చిన్నదైనప్పటికీ చాలా శక్తివంతమైనది. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఫైబర్ వంటివి పుష్కలంగా అందుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి రెండు నారింజ పండ్లలో ఉండేంత ఉంటుంది.
యాపిల్ : రోజుకో యాపిల్ తినడం వల్ల డాక్టర్ అవసరం ఉండదని నానుడి ఉంది. యాపిల్‌లో విటమిన్ సి తక్కువగానే ఉన్నప్పటికీ పెద్ద పండ్లతో పోలిస్తే యాంటి ఆక్సిడెంట్ గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది పెద్దపేగుకు వచ్చే కాన్సర్, గుండె పోటు ముప్పు నుంచి కాపాడుతుంది.
స్టాబ్రెరీ : మన శరీరాన్ని రక్షించే పండని చెప్పవచ్చు. పెద్ద పండ్లతో పోల్చుకుంటే ఇందులో ఎక్కువ మొత్తంలో యాంటి ఆక్సిడెంట్ గుణం ఉంటుంది. శరీరాన్ని కాన్సర్ కారకం నుంచి కాపాడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది.
నారింజ : దీన్ని తియ్యనైన మందని చెప్పవచ్చు. ఒక రోజులో 2 నుంచి 4 నారింజలు తీసుకుంటే జలుబు దరి చేరదు. తక్కువ కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు రాకుండా కాపాడుతుంది. పెద్దపేగు కాన్సర్ ముప్పును దరిచేరనీయదు.
పుచ్చకాయ : చల్లగా ఉండడంతో పాటు దాహం తీర్చే గుణం కలిగి ఉంటుంది. దీనిలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గ్లూటాథియోన్ అనే యాంటి ఆక్సిడెంట్‌తో నిండి ఉంటుంది. అంతేకాదు, కాన్సర్‌తో పోరాడే లైసోపిన్ ఆక్సిడెంట్‌ను కలిగి ఉంటుంది. దీనితో పాటు విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలను ఉన్నట్టు గుర్తించారు.
జామ, బొప్పాయి : ఈ రెండింటిలోనూ విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని దరి చేరనీయదు. బొప్పాయిలో కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది కండ్లకు మేలు చేస్తుంది.