అప్పుల కుప్పగా తెలంగాణ : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రతిపక్షాలు చేసేది గోబెల్స్‌ ప్రచారమంటూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తొమ్మిదేండ్లుగా అబద్దాల పాలన చేస్తున్న సీఎంను ఏమనాలని ప్రశ్నించారు. గోబెల్స్‌ ప్రచారానికి అసలుసిసలు వారసులు సీఎం కేసీఆర్‌ అని తెలిపారు. బంగారు తునక అని చెప్పి రూ.4.50లక్షల కోట్ల అప్పులు చేయటమేంటని ప్రశ్నించారు. అయినా రుణమాఫీకి, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు డబ్బు లేదని చెబుతున్నారని విమర్శించారు. చేసిన అప్పులకు ఏడాదికి రూ.30వేల కోట్ల మిత్తీలు కట్టేది నిజం కాదా? అని ప్రశ్నించారు.