కాపరులందరికీ గొర్రెలు పంపిణీ చేయాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-కొణిజర్ల
చిన్నగోపతిలో జరిగిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బండారు మల్లయ్య పెద్ద గొల్లగా ఎన్నికైన సందర్భంగా గ్రామశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం వైరా నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గత ఎన్నికల ముందు లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటిస్తానని నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శిం చారు. కాలయాపనతో రైతులు బ్యాంకులో అప్పులు పెరిగిపోయి ఆందోళన చెందుతున్నారని, వెంటనే ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. గొర్రె కాపర్లకు రెండవ దఫా గొర్రెలు పంపిణీ చేస్తామని మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం మిగిలిన గొర్రె కాపర్లు అందరికీ ఒకేసారి గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఆకాల వర్షం తుఫానుతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇస్తానని ప్రకటించి రెండు నెలలు దాటినా ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం అందలేదని, వెంటనే ప్రభుత్వం నష్టపరిహారాన్ని రైతులకు అందించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు డాక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు లింగాల భూషణం, యూటియఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్, అన్నవరపు వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శి బుర్రి గోపయ్య, కొండయ్య, వీరభద్రం, రెడ్డి నాగేశ్వరరావు, రాములు, బుజ్జి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.