ప్రవేట్‌ విద్యాసంస్థల హోల్డింగ్స్‌, ఫ్లెక్సీలు తొలగించాలి

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాద రాకేష్‌
నవతెలంగాణ-ములుగు
వెంకటాపూర్‌ మండల కేంద్రంలో అ క్రమంగా ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థల హౌల్డింగ్లను ఫ్లెక్సీలను తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు సాద రాకేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు విచ్చలవిడిగా రెచ్చిపోతు న్నాయని, హౌల్డింగ్లను ప్లెక్సీలను ప్రధాన కూడళ్ళలో పెద్దఎత్తున ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న కాని జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్న అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మండలం కేంద్రంలో విచ్చలవిడిగా హౌల్డింగ్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి దొంగ ప్రచారాలు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు చేస్తున్నారన్నారు. వారు తల్లిదండ్రులను మభ్యపెడుతూ విద్యాసంస్థల జాయిన్‌ కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ విషయాలపై జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు స్పందించి మండల కేంద్రంలో అక్రమంగా ఏర్పాటు చేసిన హౌల్డింగ్లను, ప్లెక్సీలను పెట్టిన యాజమాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రమేష్‌, లక్ష్మణ్‌, బాలు, సాయి, రాజు, తదితరులు పాల్గొన్నారు.