వరి ధాన్యం బస్తాలు దగ్ధం చేసి నిరసన
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కాట్రపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ను శనివారం సందర్శించి వారి సమస్యలు తెలుసుకొని తక్షణమే రైతులను అన్ని విధాలుగా ఆ దుకోవాలని టీపీసీసీ సభ్యులు గుగులోతు దసురు నాయక్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు తోట వెంకన్న, కిసాన్ సెల్ మండల అధ్య క్షులు చీర వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇటీవల గత కొద్ది రోజుల క్రితం అకాల వర్షాల వల్ల రైతులు పూర్తిగా నష్టపోగా ప్రభుత్వం అన్నదాతల ఆదుకోకపోగా నష్టపరిహారం చెల్లించక పండించిన కొద్ది గొప్ప వరి ధాన్యాన్ని అమ్ముకొనుటకు కొనుగోలు కేంద్రాలలో పో సుకొని రోజుల తరబడి పడి గాపులు కాసిన ధాన్యాన్ని కొనుగోలు చేయక కాంటా లు పెట్టక కాంటాలు పెట్టిన బస్తాలను సంబంధిత మిల్లులకు ఎగుమతి దిగుమతి చేయక రవాణా సౌకర్యం లేక రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, గత నాలు గు ఐదు రోజుల క్రితం కాట్రపల్లి గ్రామ కొనుగోలు కేంద్రం నుండి రైతుల ధాన్యా న్ని లారీల ద్వారా ఎగుమతి చేసుకొని కరీంనగర్ మిల్లు వద్దకు తీసుకుపోగా మి ల్లర్లు తేమ శాతం పేరుతోటి ఒక బస్తాకు నాలుగు కిలోల చొప్పున తరుగు తీస్తూ మిల్లర్లు రైతులను నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పలు చెప్పుకుం టున్న కెసిఆర్ ప్రభుత్వం రైతుల పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోకపోగా రైతులను నిర్లక్ష్యం చేస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పిం చక రైతులకు గత ప్రభుత్వాలు కల్పించిన అనేక సబ్సిడీలను ఎత్తివేస్తూ అన్ని విధా లుగా అన్నదాతలకు నష్టం చేస్తున్న, కెసిఆర్ తెలంగాణ ప్రభుత్వానికి రైతులు త్వర లోనే సరైన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి రైతుల పండించిన పంటలను తక్షణమే కొనుగోలు చేసి ఒక కింటాకు వరి ధాన్యానికి 2500 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ వా రు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకులు సిరికొండ మల్లయ్య, పుట్ట ప్రభాకర్, బొంత సంపత్ కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకురాలు, పాల్వాయి అహల్య దేవి, శీలం నీలమ్మ, పరికిపండ్ల ఐలయ్య, జాటోతులాల్ సింగ్, శీలం యాదగిరి, బోదాస్ చంద్రయ్య, ఆంగోత్ వీరు నాయక్ సాంబార్ వీరస్వామి రైతులు పాల్గొన్నారు.ఖ