ఎమ్మెల్యేల్లో టెన్షన్‌… ఆశావహుల్లో అటెన్షన్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌లో గందరగోళం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12మంది ఎమ్మెల్యేల్లో 11మంది బిఆర్‌ఎస్‌కు చెం దిన వారే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్‌లను ఎవరిని మారుస్తారోనన్న భ యం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వెంటాడుతుంది. ములుగు ఎమ్మెల్యే సీతక్క మినహా మిగతా నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలే వున్నారు. 11 మంది బిఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో మెజారిటీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వుంది. అంతేకా కుండా నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సైతం వ్యతిరేకత వుంది. ఈ క్రమం లో సీఎం కేసీఆర్‌ పలు దఫాలుగా చేయించిన సర్వేల్లో జిల్లాలోని ఎమ్మెల్యేలపై వున్న వ్యతిరేకత నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశాల్లో రెండుసార్లు ప రస్పరం భిన్నమైన వ్యాఖ్యలు చేయడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కలవరపడుతు న్నారు. ఒకమారు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకు పార్టీ టికెట్‌లు ఇస్తామని ప్రకటిం చారు. తాజా సమావేశంలో అవినీతికి పాల్పడుతున్న వారితోక కత్తిరిస్తానని వ్యా ఖ్యానించారు. దీంతో పార్టీ టికెట్‌లను ఆశిస్తున్న ఆశావహులు అప్రమత్తమయ్యా రు. ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. 11 మంది సిట్టింగ్‌లలో 8 మందిపై వ్యతిరే కతవుందని, ఇందులో ఐదుగురు సిట్టింగ్‌లను మారుస్తారన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో నడుస్తుంది.
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు చెందిన 11 సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వుండడం, పలువురిపై భూకబ్జాలు, సెటిల్‌ మెంట్లు ఆరోపణలుండడంతో పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడనుం దని పలువురు సీనియర్‌ నేతలు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సిట్టింగ్‌లకే మరో మారు పార్టీ టికెట్లు ఇస్తామని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. పీకేబృందం నిర్వహించిన సర్వేతోపాటు పలు సర్వేలను చేయిం చి సిట్టింగ్‌ ఎమ్మెల్యేల వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం మదింపు చేస్తున్నా రు. సర్వే నివేదికల ఆధారంగా పలువురు ఎమ్మెల్యేలను ఇప్పటికే సీఎం కేసీఆర్‌ మందలించారని పార్టీశ్రేణుల్లో ప్రచారం జరుగుతుంది.
తాజా విస్తృతస్థాయి సమావేశంలో దళితబంధు పథకంలో ఎమ్మెల్యేలు అవి నీతికి పాల్పడుతున్నారని, వారి చిట్టా తనవద్దవుందని, పద్ధతి మార్చుకోకపోతే తో క కత్తిరిస్తానని ఘాటుగా హెచ్చరించారు. దీంతో సిట్టింగుల్లో గుబులు బయలు దేరింది. ఇప్పటి వరకు తమకు వచ్చే ఎన్నికల్లో పార్టీటికెట్‌కు ఢోకాలేదని భావించి న సిట్టింగులు సీఎం తాజా హెచ్చరికలతో భయాందోళనలో పడిపోయారు. 11 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ తూర్పు, మహ బూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పువుండే అవకాశముం దన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది.
ప్రజలతో మమేకమై..
శాసనసభ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండడంతో రాజకీయ పార్టీలు పా ర్టీ కార్యక్రమాలు, పార్టీల్లో చేరికలను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వుండడంతో వారికి సీఎం ఇప్పటికే హెచ్చరించడం దరిమిలా సదరుఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్య క్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సభలు గ్రామస్థాయి వరకు నిర్వహిస్తుండడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సభలకు పలు గ్రామాల్లో ప్రజలు హాజరుకావడంలేదు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సొంత నియోజక వర్గమైన పాలకుర్తి పరిధిలోని పెద్దవంగర మండలంలో పలు గ్రామాల్లో ప్రజలు హాజరుకాకపోవడం గమనార్హం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై వ్యతిరేకత లే దని భావిస్తున్న క్రమంలో ఆత్మీయ సభలకు ప్రజలు రాకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది.
‘సిట్టింగు’ల్లో గుబులు
వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఛీఫ్‌ విప్‌ దాస్యం వినరుభాస్కర్‌ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ‘దాస్యం’ వర్గంలోనూ గుబులుంది. తమ నేతపై కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో ‘దాస్యం’ ఎక్కడున్నా, ఆయన వెంటే వుండాలని ఇటీవల జరిగిన ముఖ్యుల సమావేశంలో అనుచరులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా సీనియర్‌ నేత, మాజీ మంత్రి, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌.రెడ్యానాయక్‌ సైతం తనను ఓడించడానికి కుట్ర లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం బీఆర్‌ఎస్‌లోని అంతర్గత విభేధాలను బ హిర్గతం చేస్తుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్ట సాధ్యంగా మారే అవకాశాలు లేకపోలేదు. సీఎం కేసీఆర్‌ తాజా వ్యాఖ్యలతో వచ్చే శాసనసభ ఎన్నికల్లోపార్టీ టికెట్‌లను దక్కించుకోవడానికి ఎమ్మెల్సీలు, ద్వితీయశ్రేణి నేతలు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.