సర్వే నెంబర్ 321 భూములను పేదలకు పంచాలి
సీపీఎం నాయకురాలు నలిగంటి రత్నమాల
నవతెలంగాణ-వరంగల్
భూ పోరాటాల నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య అని సీపీఐ (ఎం) నాయకురాలు న లిగంటి రత్నమాలఅన్నారు. సీపీఐ(ఎం) నాయకులు దుర్గయ్య అధ్యక్షతన నిరసన తెలిపారు. ఈసం ద ర్భంగా సీపీఐ (ఎం) నాయకురాలు నలిగంటి రత్న మాల మాట్లాడుతూ శివనగర్ ఏరియా మైసయ్య నగర్ సమీపంలోనీ సర్వే నంబర్ 321 భూములలో పేదలుగుడిసెలు వేసుకుంటే సీపీఐ( ఎం) నాయకు లపై కొంతమంది దాడిచేయడం సిగ్గుచేటు అన్నా రు. సీఎం కేసీఆర్ ప్రభు త్వం నుండి ఇల్లు లేని నిరు పేదలకు డబుల్ బెడ్ రూ మ్ ఇల్లు కట్టిస్తానని చెప్పా రు. అదేవిధంగా 58 జీవో ప్రకారం ప్రభుత్వ భూము ల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని , ఇల్లు కట్టుకోవడానికిరూ.3లక్షలు ఇస్తామని తెలిపారు . నిరుపేదల కోసం భూ పోరాటాలు చేసి ఇళ్ల స్థలా లు ఇప్పించిన చరిత్ర సీపీఐ(ఎం) పార్టీకి ఉందని అ న్నారు.
స్థానిక కార్పొరేటర్ ప్రజాప్రతినిధి అండదండ లతో కొంతమందిని ఉసిగొల్పి, నిరుపేదలు వేసుకు న్న గుడిసెలను తీసేస్తూ అదేవిధంగా జెండాలను, బ్యానర్లను చింపుతు సీపీఐ(ఎం) నాయకులపై దాడు లు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తు, సీపీఐ (ఎం) నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నా రని అ న్నారు. అధికార బలం, ధన బలం ఉందని నిరుపేద లలో అనైక్యతను సష్టించి భూ పోరాటా లను అపాల నుకోవడం అవివేకం అన్నారు.
అధికారం ఎల్లకాలం ఉండదన్నారు, ప్రజా ప్రతి నిధులకు అధికారం పేదలు పెట్టిన బిక్ష అని అన్నా రు. విద్యార్థులు, నిరుపేదలు, మేధావులు యువకు లు, ప్రతిఒక్కరూ గమనిస్తున్నారనీ అన్నారు. గద్దెనెక్కి చ్చిన పేద ప్రజలే గద్దె దించే రోజు అతి త్వరలో ఉందనిఅన్నారు. ఇప్పటికైనా పేద ప్రజల న్యాయ పోరాటాన్ని గమనించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఖిలా వరంగల్ ఏరియా కమిటీ నాయకులు సుతారి సారంగపాణి, ఉదరు కుమార్, వేణు, సమ్మయ్య, కన్నా, శ్రీను సదన్న,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.