– ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
నేరాలు జరగకుండా నియంత్రించేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 39 వ వార్డు గాంధీనగర్ యాదవ సంఘం భవనంలో సిసి కెమెరాలను ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. నేరాలు జరిగిన సమయంలో అసలు నేరస్థులు ఎవరో గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ రూ. 10 లక్షల వ్యయంతో 39 వ వార్డులో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కషి చేస్తామన్నారు. గాంధీ నగర్ లో సిసి కెమెరాలు ఏర్పాటుతో మున్సిపాలిటీలోని మిగతా వార్డులకు చెందిన ప్రజలు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తమపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. టూ టౌన్ సిఐ పసుపులేటి నాగదుర్గ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఎన్ని కేసులు సీసీ కెమెరాలు ద్వారా గుర్తించడం జరిగిందని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. టూ టౌన్ ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీసీ కెమెరాల వినియోగం, వాటి పనితీరు పై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక కౌన్సిలర్ దాసరి గోపమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, బిజెపి మున్సిపల్ ఫోర్ లీడర్ బండారు ప్రసాద్, టూ టౌన్ ఎస్‌ఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దాసరి సాయి, గుర్రం వెంకన్న బొజ్జ నాగరాజు, కంకణాల నాగిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.