– నేడు అండర్ రైల్వే జోన్ ప్రాంతంలోని
– 32 33, 39,40 డివిజన్‌లో నీటి సరఫరా బంద్
– ఎయిర్ వాల్ మరమ్మత్తులను పరిశీలించిన మేయర్
నవతెలంగాణ-కాజీపేట
ప్రధాన పైప్లైన్ మరమ్మత్తులు వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. కడిపికొండ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో కారు ఢకొట్టడం వలన పగిలిన ధర్మసాగర్ 60 ఎం.ఎల్.డి ప్రధాన నీటి సరాఫరా పైప్లైన్ ఎయిర్ వాల్ ను ఆదివారం రాత్రి మేయర్ పరిశీలించి త్వరితగతిన మరమ్మ తులను పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ మరమ్మత్తులు జరుగు తున్న నేపథ్యంలో నేడు అండర్ రైల్వే జోన్ ప్రాం తంలోని 32, 33, 39, 40 డివిజన్లోని ఎస్‌ఆ ర్‌ఆర్ తోట, పెరుగువాడ, కరీంబాద్, భగత్ నగర్, జ్యోతి నగర్, డీకే నగర్, కాశి కుంట, ఉర్స్, జన్మభూమి జంక్షన్, ఏకషీలా నగర్, శాంతి నగర్, తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేయడం జరిగిందని ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బల్దియా ఈఈ శ్రీనివాస్,ఏఈలు ముజమ్మిల్, వెంకటేశ్వర్లు, లైన్మెన్లు ఉన్నారు.