– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-మహబూబాబాద్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన ఉద్యమకారులను ప్రజా సంఘాలను ఉద్యమ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం వీర భవన్లో పెరుగు కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఇబ్బందులు కష్టనష్టాలకు ఓర్చి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఉద్యమ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తగిన గౌరవం ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఒక జాతీయ పార్టీగా నాడు ఒక ప్రాంతంలో నష్టపోతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగు ణంగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సింగరేణి ఆర్టీసీ లాంటి అనేక కార్మికుల సంఘాలను, విద్యార్థి, యువజన మహిళ సంఘాలను ఉ ద్యమంలో భాగస్వాములను చేసితెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వెయ్య ఏనుగుల బలం ఇచ్చిన విషయాన్ని మర్చిపోరాదని వారు అన్నారు. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా రైల్ రోకోలు, వంటావార్పు కార్యక్రమాలు, రహదారుల దిగ్బంధనం, సకల జనుల సమ్మె, సాగరహారం, వంటి కార్యక్రమాల్లో పాల్గొని, అనేక కేసులు నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సీపీఐ కార్యకర్తలు ముందు వరసలో నిలిచారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సమాజానికి మరో సారి గుర్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయ సారధి మాట్లాడుతూ జూన్2న మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా అన్ని మండల గ్రామ శాఖల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనం గా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జి ల్లా సహాయ కార్యదర్శి బి.అజరు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు తమ్మెర విశ్వే శ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు కట్టబోయిన శ్రీనివాస్, నాయకులు పాండురంగ చారి, వరిపల్లి వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, చింతకుంట్ల వెంకన్న, పోగుల శ్రీని వాస్, రేషపల్లి నవీన్, నెల్లూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు.