కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాల ప్రభావంపై సదస్సు

నవతెలంగాణ – కంటేశ్వర్
సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ మతోన్మాద విధానాలు కార్మిక వర్గం పై ప్రభావం సిఐటియూ జిల్లా కార్యాలయంలో జిల్లా సదస్సు సోమవారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు హాజరై ప్రసంగిస్తూ.. బిజెపి అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాల వల్ల అన్ని రంగాల ప్రజానీకంపై తీవ్ర ప్రభావం పడుతుందని. మతోన్మాద చర్యల వల్ల కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులకు గురైందని ,కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో విభజించు పాలించనే రకంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని కార్మికులకు రోజుకు కనీస వేతనం 178 రూపాయలుగా నిర్ణయించిందని, ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచిందని ,కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేబర్ కోడ్స్ ను తెచ్చిందని, ఈ రకంగా కార్మిక వర్గంపై దాడికి పాల్పడిందని. 460 రూపాయలు ఉన్న గ్యాస్ బండ 1260 రూపాయలకు పెంచిందని, నిత్యావసర సరుకుల ధరలు ఎన్నో రేట్లు పెరిగాయని ,కార్మికులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటచేస్తుందని, స్కీం వర్కర్లపై దాడి చేస్తుందని ఆశ అంగన్వాడి వివో ఏలు గ్రామపంచాయతీ మున్సిపల్ హమాలీలు భవన నిర్మాణ కార్మికులు తదితర సంఘటిత అసంఘటిత రంగాలపై బిజెపి ప్రభుత్వం విచ్చలవిడి దాడిలకు దాడికి పాల్పడుతుందని. దీనికి వ్యతిరేకంగా సమైక్యంగా కార్మిక వర్గం మొత్తం పోరాటాల కుసిద్ధం కావాలని రాబోయే సాధారణ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు.  జిల్లా సదస్సు లో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల కార్మికులు రోజురోజుకు నిరుపేదలుగా మారుతున్నారని స్కీం వర్కర్లను, ప్రైవేటీకరించాలని ఇప్పటికే ప్రభుత్వం పూనుకుందని ఆమె విమర్శించారు. రాబోయే కాలంలో విస్తృతంగా కార్మిక పోరాటాలు చేయాలని. ఈనెల 30న సిఐటియూ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జెండా ఆవిష్కరణ లు జరపాలని, గ్రామపంచాయతీ వర్కర్ల సమస్యల పైన భవనిర్మాణ కార్మికుల సమస్యల పైన అంగన్వాడి ఆశాలపై సమస్యల పైన బీడీ వివోఏ అసంఘటిత రంగం సంగటితరంగంపై ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్ సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ణ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కటారి రాములు, కృష్ణ, ఫారుక్ గంగామణి జరీనా యాస్మిన్ కాలేజ్ గణేష్ రాజేష్ సాయిలు గంగారాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.