అమ్మాయి దుస్తులు వేసుకొని దొంగతనం

– నిందితుడు అరెస్ట్‌
నవతెలంగాణ-బేగంపేట్‌
అమ్మాయి దుస్తులు ధరించిన ఓ సెక్యురిటీ గార్డ్‌ చేసిన దొంగతనం అందరినీ విస్మయానికి గురి చేసింది. అమ్మాయిలు వేసుకునే రాత్రి దుస్తులు(నైటీ) ధరించి అర్ధరాత్రి తాను పనిచేసే దుకాణానికే కన్నం వేశాడు అతను. దొంగ తనం జరిగిన తర్వాత సెలవు పై స్వగ్రామానికి వెళ్లడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. నింది తుడి నుంచి పోలీసులు రూ. 8 లక్షల విలువైన సెల్‌ఫో న్‌లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌.డి రహదారిలో ఉన్న మొబైల్‌ దుకా ణంలో యాకయ్య అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచే స్తున్నాడు. అయితే దుకాణంలో సీసీ కెమె రాలు పనిచేయక పోవడాన్ని ఆసరాగా తీసుకున్న యాకయ్య అర్ధరాత్రి గుర్తుపట్టకుండా ఉండేందుకు అమ్మాయిలు రాత్రి వేసుకునే దుస్తులు ధరించి దుకాణంలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగతనం చేసిన వెంటనే మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌లో తన స్వగ్రామానికి సెలవుపై వెళ్లాడు. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు యాకయ్యను విచా రించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. డబ్బుల కోసం దొంగతనానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మహంకాళి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, ఎస్సై పాల్గొన్నారు.