స్వయం ఉపాధి వైపు యువత అడుగులు వేయాలి

– కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
స్వయం ఉపాధి మార్గం ఎంచుకుని 10 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయడం అభినం దనీయమని కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్‌లోని ఆదర్శ్‌ నగర్‌ కాలనీ రోడ్డు నెం 3 వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అజిజ్‌ ఫాబ్రీకేషన్‌ అండ్‌ వెల్డింగ్‌ వర్క్స్‌ షాపును శేరిలింగం పల్లి కార్పొరేటర్‌ రాగం నాగేం దర్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వ యం ఉపాధి మార్గం ఎంచుకుని 10 మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయడం అభినందనీయ మని అన్నారు. ధరలు, నాణ్యత విషయంలో విని యోగదారులు నమ్మకాన్ని పెంచే విధంగా వ్యాపారం నిర్వహించి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో నిర్వాహకులు అజిజ్‌, సలీం, గఫర్‌, ఖాదర్‌, తాహెర్‌, నజీర్‌ ఖాన్‌, అఫ్సర్‌, సత్యనా రాయణ, శంకర్‌ ముదిరాజ్‌, శ్రీనివాస్‌, హాజీ, సత్తార్‌, నీలకంఠ రెడ్డి, సయ్యద్‌, సయ్యద్‌ సమీర్‌, అజ్మీర్‌, ఫరీద్‌, తదితరులు పాల్గొన్నారు.