– సీఎం కేసీఆర్‌కు సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయల సమస్యలను పరిష్కరించాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాముక కమలాకర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం ప్రకటనల కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు తక్షణమే పాత పెన్షన్‌ను వర్తింపచేయాలని పేర్కొన్నారు. పీఆర్సీ కమిటీని వేయాలని, మధ్యంతర భృతి (ఐఆర్) 20 శాతం ప్రకటించాలని తెలిపారు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని పేర్కొన్నారు.