యాదాద్రి ఆలయం పూర్తి రూపాంతరం చెందింది

– అఖిలభారత బ్రాహ్మణ సమాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యాదాద్రి లక్ష్మినర్సింహాస్వామి ఆలయం పూర్తిగా రూపాంతరం చెందిందని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్‌ ప్రదీప్‌జియోతి తెలిపారు. గురువారం ఆలయాన్ని సమాఖ్య నేతలు సందర్శించారు. సీఎం కేసీఆర్‌ బ్రాహ్మణ సమాజం కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.దేశం నలుమూలలనుంచి యాత్రికులు ఇక్కడికి రావటం విశేషమని ఆలిండియా బ్రాహ్మణ ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ పండిట్‌ పదం ప్రకాష్‌ పేర్కొన్నారు.