నవతెలంగాణ-కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్లకు కష్టాలు తప్పడం లేదు. సమస్యలు పరిష్కరించడం లేదని, కాలనీల అభివృద్ధికి నిధులు ఇప్పించడం లేదని, పనులు జరగడం లేదని నిరసనలు తప్పడం లేదు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ లో 18 వ డివిజన్ కార్పొరేటర్ యమునా అనిల్ ఇంటి ముందు గంగా స్థాన్ ఫేస్ వన్ గణేష్ నగర్ కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. కార్పొరేటర్ గా ఎన్నికైన యమునా అనిల్ తర్వాత తమ కాలనీలో సమస్యల కొరకు కార్పొరేటర్ తో పాటు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆరోపించారు. గణేష్ నగర్ కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ని తెలుపుతామని హెచ్చరించారు.
18వ డివిజన్లో కార్పొరేటర్ యమునా గెలిచినప్పటికీ తన భర్త అనిల్ అన్న పనులు ముందుకు వచ్చి చేస్తానని ఆ కాలనీ ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ కేవలం అధికార పార్టీకి సంబంధించిన కాలనీలలో అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నచోటే పనులను చేపిస్తున్నాడు తప్ప మిగతా విషయాలు మిగతా పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఇంటికి వెళ్లి అడిగిన చేస్తాను చూస్తాను అని సాకు చెబుతూ రోజు తన దినచర్యగా మార్చుకున్నాడు. ఇండిపెండెంట్గా గెలిచి టిఆర్ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్న యమునా అనిల్ సమస్యలు పరిష్కరించడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఇలా చెబుతూ పోతే కార్పొరేటర్ పై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి కానీ కార్పొరేటర్ అలాగే తన భర్త అనిల్ స్పందించకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నప్పటినుండి అక్కడే ఉండి కార్పొరేటర్ భర్త అనిల్ అక్కడున్న ప్రజలకు ఎన్నో సేవలు అందించినప్పటికీ గెలిచిన అనంతరం ఇలాంటి సమస్యలు పరిష్కరించకపోవడంతో అక్కడున్న ప్రజలు కూడా ఎల్లవేళలా సహకరిస్తున్నప్పటికీ పనులు గుర్తు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేటర్ యమున తన భర్త అనిల్ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.