స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు

– వంట సామాగ్రి అందజేత
నవతెలంగాణ- తాడ్వాయి
ఇటీవల వారం రోజుల క్రితం మండలంలోని బీరెల్లి గ్రామానికి చెందిన మెంతని రాము దశదినకర్మకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి, స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామని 50 కేజీల బియ్యం, 10 లీటర్ల మంచి నూనె ఇతర సామాగ్రి, కొంత నగదు అందించారు. ఈ సందర్భంగా వారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని, బాధపడ్డారు. మంతెన రాము మా మధ్యలో లేనందుకు బాధపడ్డారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని బంధాలకన్నా స్నేహబంధం గొప్పదని స్నేహితుడు ఆపదలో ఉంటే ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని వారన్నారు. తమ స్నేహితుని కుటుంబానికి భవిష్యత్తులో కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కాయితి రాజేష్, కాయితి రాజశేఖర్, దాసుల శివకుమార్, అన్నలి నాగ కిషోర్, అబ్బరబోయిన మహేష్, మనోజ్, సతీష్, కాటాపూర్ సంపత్, వంగరి భరత్ కుమార్ తదితరులు వారి కుటుంబాన్ని ఆదుకుంటామని సానుభూతి తెలిపారు.