నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
తార మైదాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రజిత, స్టాఫ్ నర్స్ స్రవంతి, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేష్. ఏఎన్‌ఎంలు లక్ష్మీ, స్వాతి, ఆశావర్కర్‌లు విజయలక్ష్మి, సంధ్య, కవిత, హైమది, నజియా, రజిత, విజయ పాల్గొన్నారు.
ఇసామియా బజార్‌లో..
ఇసామియా బజార్, సుల్తాన్ బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహక,పీహెచ్‌ఎన్ లు రామలక్ష్మి, విజయమ్మ, ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్టు రాధిక, ల్యాబ్ టెక్నీషియన్ సునీల్, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
బొగ్గుల కుంటలో..
బొగ్గులకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మజ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీప్తి ప్రియాంక, ల్యాబ్ టెక్నీషియన్ తిరుపతి, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ఏఎన్ ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్‌లో..
కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివా సరావు, డాక్టర్ రామదాస్, ఫార్మసిస్ట్ జ్యోతి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో..
కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, హెచ్‌ఓడీ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, ఆర్‌ఎంఓ డాక్టర్ జయ మనోహరి, డాక్టర్ కరుణ, ఆఫీస్ సూపరింటెండెంట్ సునీల్, సీనియర్ అసిస్టెంట్ బి.రాజు, సంతోష్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ రవి, స్రవంతి, నిహారిక, టి.రాజు పాల్గొన్నారు.
కోఠి డీఎంహెచ్‌ఎస్ ఆవరణలో
కోఠి డీఎంహెచ్‌ఎస్ ఆవరణలో ఉన్న ప్రాంతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రం వద్ద నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఆరోగ్య విద్యా విస్తరణ అధికారి డి.వెంకటరామనరసయ్య, డాక్టర్ రాజశేఖర్, గెజిటెడ్ ఆఫీసర్ ఎస్.రామాంజనేయులు, ఆర్‌బీఎస్‌కే డాక్టర్ వసంత, జయలలిత, నర్సు బాయి పాల్గొన్నారు.
ఓయూ : విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా విద్యను అందిస్తున్న వారిలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలు పెంపొ ందించి వారి భవితకి పెద్దపీట వేస్తామని కె.వెంకన్న జూనియర్ కళశాల వైస్ ఛైర్మన్ కె.భిక్షపతి అన్నారు. శుక్రవారం తార్నా కలోని కె.వెంకన్న జూనియర్ కళాశాలలో రాష్ట్ర ఆవిర్భావ దినో త్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.రాం బాబు, వైస్ ప్రిన్సిపాల్ రాజేష్, కాలేజ్ ఆడ్మిన్ సునీల్ కుమార్, నీట్ ఐఐటీ అధ్యాపకులు ఆర్కే పాండే, జి.గౌరవ వేంద్రసింగ్, పష్టి, యశస్కర్, శ్రీనివాస్, విద్యార్థులు, అధ్యాపకులు, పాల్గొన్నారు.
ఓయూ నాన్ టీచింగ్ హౌంలో..
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఓయూ మూడు బోధనేతర సంఘాల అధ్వర్యంలో నాన్ టీచింగ్ హౌంలో జాతీయ పతాక ఆవిష్కరణ, ఆచార్య జయశంకర్ విగ్రహానికి పుష్పాంజలి చేశారు. బి.జ్ఞానేశ్వర్, తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయేస్ అసోసియేషన్ అధ్యక్షులు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ విజరు కుమార్, రవి, అక్బర్ బేగ్, భీమయ్య, జలీల్, భూమ రావు, శంకర్ నాయక్, సురేష్, శ్రీనివాస్ శంకరయ్య, రాకేష్, ఆంజనేయులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓయూ అర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆరేస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటపోతుల రమేష్ గౌడ్ అద్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ రాష్ట్ర నాయకులు రాంనర్సింహ గౌడ్, బీఆరేస్వీ నేతలు కొంపల్లి నరేష్, గణేష్, విజరు, శ్రావణ్, సంజరు, శేఖర్, శ్రీధర్, నరేష్, అజీజ్, సికిందర్ పాల్గొన్నారు.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట..
ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు మంద సురేష్, బండారు వీరబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ నాటి ఉద్యమ స్పూర్తిని నేటి పాలనను కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
విజయ డెయిరీలో..
విజయ డెయిరీలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్ సోమ శరత్ కుమార్ జెండాను ఎగరేశారు. సీఎం కేసీఆర్ తోడ్పాటు తో సమాఖ్య రాష్ట్రంలో నిర్విరామంగా ఉన్న డెయిరీకి మేఘ డెయిరీ నిర్మాణం, రైతులకు రూ. 4 ఇన్సెంటివ్ ఇస్తూ పాడి రైతులను వెన్నుతట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ, రిటైర్డ్ ఐఎఎస్ ఆధార్ సిన్హా, జీఎంలు మల్లయ్య, మల్లికార్జున్, కమేష్, దేవేందర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట..
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ఓయూ వీసీ ప్రొ.రవీందర్ జాతీయ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీ నారాయణ, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ధూల్‌పేట్ : రాష్ట్ర అవతరణ దశబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం చాంద్రాయణ గుట్ట నర్కి పూల్ బాగ్ లోని జీహెచ్ ఎంసీ చార్మినార్ జోనల్ కార్యాలయంలో జోనల్ పరిధిలోని సర్కిల్‌ల అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన జోన్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్..
ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో..
ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా జెండాను ఆవిష్కరిస్తున్న హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, హాస్పిటల్ యంత్రాంగం, తదితరులు పాల్గొన్నారు.
చార్మినార్‌లో..
రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా చార్మినార్ నియోజక వర్గంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డారుల్ షిఫాలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫిరాసత్ అలీ బాక్రి.
అంబర్‌పేట : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్‌ఎస్ అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహంకాళి ఆలయంలో ప్రచార రథం వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అంబర్‌పేట చే నెంబర్ చౌరస్తాలో జాతీయ జెండా ఎగురవేసి అనంతరం బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గరిగంటి రమేష్, మాజీ కార్పొరేటర్లు గరిగంటి శ్రీదేవి రమేష్, పులి జగన్, సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్, నాగేష్ గౌడ్, జీవన్ గౌడ్, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పాల్గొన్న నాయకులు..
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు పంజాల గిరిధర్ గౌడ్, హాబీబ్, అంజి, శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
జెండా ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే కాలేరు
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్‌లో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఉత్సవాలను ప్రారంభించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే అలీ కేఫ్ చౌరస్తా, గోల్నాకలోని డీ మార్ట్, బాగ్ అంబర్ పేటలోని రెడ్ బిల్డింగ్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా, కాచిగూడలోని లింగంపల్లి చౌరస్తాలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజరు కుమార్ గౌడ్, దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ ముదిరాజ్, చంద్రమోహన్, ఎర్ర భీష్మ దేవ్, కొమ్ము శ్రీను, సీనియర్ నాయకులు, డాక్టర్ శిరీష యాదవ్, డాక్టర్ ఓం ప్రకాష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
సెయింట్ హన్నస్ స్కూల్‌లో..
సెయింట్ హన్నస్ స్కూల్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు చైర్మన్ ఎం.సల్మాన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.