ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి సర్టిఫికెట్ల ప్రదానం

నవతెలంగాణ-దుండిగల్‌
తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లా కార్యాలయ పరేడ్‌ గ్రౌండ్‌,అంతాయిపల్లి జిల్లా అధికారుల సమీకత భవన సముదాయంనందు రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి శాఖా చామకూర మల్లారెడ్డి. ఆధ్వర్యంలో అడిషనల్‌ కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్య ,సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, అతిథులుగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్‌ కోలన్‌ నీలా గోపాల్‌ రెడ్డి, సందేశం అనంతరం జిల్లా వ్యాప్తంగా పలు మున్సిపా లిటీలు,మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఆయా విభాగాల అధికారులకు, సిబ్బందికి, సర్టిఫికేట్లు అందించారు. ఎన్‌. ఎం. సి. కమిషనర్‌ రామకష్ణ, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ప్రశాంతికి, ఏఈ రాకేష్‌ కి సర్టిఫికేట్‌ లను ప్రధానం చేయడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్థానిక జిల్లా క్రీడాకారులకు అవార్డ్‌ లు, ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల ,మున్సిపల్‌ కార్పొరేషన్ల, గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్‌ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.