పాత నేరస్తుడు అరెస్టు

200 గ్రాముల గంజాయి పట్టివేత
నవతెలంగాణ- వనస్థలిపురం
తక్కువ ధరకు గంజాయి కొని ఎక్కువ ధరకు విక్రయిస్తున్న పాత నేరస్తుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వనస్థలిపురం సీఐ జలంధర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీ మసీదు రోడ్‌ లో నివసిస్తున్న షేక్‌ షాహుద్దీన్‌..గతంలో ఎల్బీనగర్‌, చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్లో పరిధిలో నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా అతడు తన ప్రవర్తన మార్చుకోకుండా తనకు తెలిసిన వారి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇతర వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతూ 200 గ్రాముల గంజాయితో వనస్థలిపురం పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో ఇతనిపై గతంలో కేసులు ఉన్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని షేక్‌ షావుద్దీన్‌ పై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్లు పోలీసులు తెలియజేశారు.