రాష్ట్రంలో బీజేపీ మత రాజకీయాలను తిప్పికొట్టాలి

సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఛాయాదేవి
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
మిశ్రమ సంస్కతి కలిగి ఉండి మత సామరస్యం, శాంతియుతంగా జీవిస్తున్న రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలను సృష్టించి అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్న బీజేపీ, దాని మత రాజకీయాలను తిప్పికొట్టి వచ్చే ఎన్ని కల్లో అవమానకరంగా ఓడించాలని సీపీఐ హైదరాబా ద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఛాయాదేవి సూచించారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని సీపీఐ జిల్లా కార్యాల యం వద్ద రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరేసి మాట్లాడారు. బీజేపీ పాలనలో ఉన్న ఈశాన్య చిన్న రాష్ట్రాల్లో విద్వేషాలు, ప్రతిరోజూ ఘర్షణలు, హింస చెలరేగుతుందన్నారు. శాంతియుత జీవనానికి ప్రజలు దూరమయ్యారనీ, తెలంగాణ ప్రజలు గమనించాలని గుర్తు చేశారు. తెలం గాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభు త్వం పాలన కొనసాగించడం లేదనీ, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జాప్యం జరుగుతుంద న్నారు. అన్ని రంగాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ప్రజా సాధికారత సాధించడంలో వెనుకబడే ఉన్నామని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, దళితబం దు పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతి ఇంటికీ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నిం చారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను నీరు గార్చే ప్రయత్నం చేస్తే ఉరుకునేది లేదనీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చాలనీ, లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 2014, 2018లో సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. సంక్షేమ పథకాల అమలు లాంఛనప్రాయమేనని అందరికి చేరడం లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి.నరసింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చ కుండా వారి మనోభావాలతో ఆడుకుంటే నిజాం సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ నెల కొత్తగూ డెంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తు న్నామనీ, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సీపీఐ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు బి.వెంకటేశం, సీనియర్‌ నాయకురాలు పి.ప్రేమ్‌ పావని, హైదరాబాద్‌ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి.స్టాలిన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.చంద్రమోహన్‌ గౌడ్‌, పడాల నళిని, నెర్లకంటి శ్రీకాంత్‌, ఎండి.ఒమర్‌ ఖాన్‌, నగర నేతలు ఆరుట్ల రాజ్‌కుమార్‌, ఎస్‌.కె.లతీఫ్‌, చెట్టుకింది శ్రీనివాస్‌, కె.ధర్మేంద్ర, సలీమ్‌ ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.