1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఆవిర్భావం

నవతెలంగాణ-అడిక్‌మెట్‌
తెలంగాణ సాధన ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాలేదనీ, 1200 మంది ఆత్మబలిదా నాలతో ఆవిర్భవించింది అని గాంధీనగర్‌ కార్పొరేటర్‌ పావని వినరు కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర యువ నాయకులు వినరు కుమార్‌, డివిజన్‌ అధ్యక్షులు రత్న సాయి చంద్‌, సీనియర్‌ నాయకులు శ్రీకాంత్‌, రాజు, ఎం.ఉమేష్‌, ఆకుల సురేందర్‌, ప్రకాష్‌ యాదవ్‌, విస్తారక్‌ హరీష్‌, శ్రీనివాస్‌, నర్సింహ, దోనేటి సత్యం, ఆనంద్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.