పేద ప్రజల పట్ల అధికారుల దురుసు వైఖరినీ మానుకోవాలి

– సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ-  కంటేశ్వర్
పేద ప్రజల పట్ల అధికారుల దురుసు వైఖరిని మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు శనివారం గత పది రోజులుగా నిరుపేద ప్రజలు స్థలాలు కొరకు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని భూ పోరాటం నిర్వహిస్తున్న పేదల వద్దకు రెవిన్యూ అధికారులు, పోలీస్ అధికారులు వచ్చి బెదిరింపులకు పాల్పడుతు చట్ట వ్యతిరేకంగా గుడిసెలు వేస్తున్నారని గుడిసెలు తొలగించని యెడల పేదల పైన కేసులు నమోదు చేయాల్సి వస్తుందని భయభ్రాంతులకు గురి చేయటం సరైంది కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కానీ ఇండ్ల స్థలాలు కానీ ఇవ్వకుండా అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యంగా విస్మరించటం వలన ప్రజలు తిరిగి వేసారి గత్యంతరం లేక ఇంటి యజమానుల కిరాయిలను భరించలేక లో గుడిసెలు వేసుకున్నారని ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటిస్తున్నప్పటికీ వేసుకున్న గుడిసెలను తొలగించాలని అధికారులు పేదల పట్ల దురుసుగా వివరించటం బాధ్యతరహితమని ప్రజలను ఆదుకోవలసిన ప్రభుత్వమే ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరేంది కాదని నగరంలో అనేకమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించి లక్షలాది రూపాయలను కూడా పెడుతున్నారని వారి పట్ల చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు పేదల మా పట్ల మాత్రం ఒంటి కాలిపై రావటం ప్రజల పట్ల ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల తమ వైఖరిని చేస్తుందని వారు అన్నారు ఇండ్ల స్థలాలు సాధించేవరకు ప్రజలు భూపోరాటాన్ని కొనసాగిస్తారని అధికారుల బెదిరింపులకు లొంగే పరిస్థితి లేదని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుజాత, రాములు నగర కమిటీ సభ్యులు కృష్ణ, అనసూయమ్మ, కళావతి తదితరులతోపాటు వందలాది మంది నిరుపేదలు పాల్గొన్నారు.