రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్

నవతెలంగాణ – గోవిందరావుపేట
రైతుల పక్షాన నిలిచి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తానని అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రంగాపురం క్లస్టర్ రైతు వేదికలో నోడల్ ఆఫీసర్ ఎంపిఓ సాజిదా బేగం అధ్యక్షతన రైతు దినోత్సవం కార్యక్రమం జరిగింది. రైతుల సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్ హాజరై రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గం చూపుతానని అన్నారు. అనంతరం సామూహిక బోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీలు ,మహిళ సంఘాల సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.