– తెలంగాణ సినిమా థియేటర్ ఆపరేటర్
ఎంప్లాయిస్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మారన్న
నవతెలంగాణ-ధూల్‌పేట్
సినిమా థియేటర్‌లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ సినిమా థియేటర్ ఆపరేటర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ మారన్న అన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్‌లో యూనియన్ క్యాలెండర్‌ను ఈశ్వర్ థియేటర్ అధినేత హనుమంత్‌రెడ్డితో కలిసి ఎన్ మారన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినిమా థియేటర్‌లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నార న్నారు. చాలీచాలని వేతనాలతో థియేటర్లలో పని చేస్తూ కుటుంబాలు గడవక అంతర్గతంగా వేదన పడుతున్నారని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, పనిగం టలు తగ్గించాలని, దీని పై యజమాన్యం ఆలోచించాలని కోరారు. లాక్ డౌన్‌లో సినిమా థియేటర్లన్నీ మూసుకుపోతే కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ఇప్పట ికైనా కొత్త కొత్త సినిమాలు వస్తున్నప్పుడు కార్మికులకు వేత నాలు పెంచాలని, సరైన సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. చాలా థియేటర్లలో కార్మికులను తొలగి స్తున్నారని, వాళ్లకు పని లేక చాలా ఇబ్బంది పడుతు న్నారన్నారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఎస్‌ఐ, పిఎఫ్ అమలు చేయాలన్నారు. దీన్ని ప్రభుత్వం గుర్తించి వాళ్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు పుల్లారావు, అరుణ్, సుధాకర్, వీరస్వామి, వీరేష్ థియేటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.