2 వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన తెలంగాణ ప్రాంతం భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. 2014 జూన్ 2న కొత్త రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన త్యాగధనులు కూడా ఎందరో వున్నారు. వారిలో కొందరి జీవిత చరిత్ర ఆధారంగా ‘తెలంగాణ త్యాగధనులు’ పేరిట వెబ్ సిరీస్ రూపుదిద్దుకోనుంది. ఆదివారం సాయంత్రం ఈ వెబ్‌సిరీస్ ప్రారంభోత్సవం, గీతావిష్కరణ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌డిసి చైర్మన్ కూర్మాచలం, దర్శకులు రేలంగి నరసింహారావు, నటి రోజారమణి, నిర్మాత రాజ్ కందుకూరి, వకుళా భరణం కష్ణ మోహన్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విజన్ వివికె ఫిలిమ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా రూపుదిద్దుకుంటోన్న ఈ పీరియాడికల్ వెబ్ సిరీస్‌కి నాగబాల సురేష్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, వ్యాపారవేత్త శ్రీ విజన్ వివికె హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత వి.విజరు కుమార్ నిర్మిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంతో పాటు ఈ వెబ్ సిరీస్‌లోని ‘వందనం వందనం తెలంగాణ త్యాగధనులకు ఇదే వందనం’ అనే గీతాన్ని సీనియర్ నటి రోజా రమణి విడుదల చేసారు. ఎఫ్ డి సి చైర్మన్ కూర్మాచలం చేతులమీదుగా నిర్మాత వి విజరు కుమార్‌కు క్లాప్ అందించడంతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా వి.విజరు కుమార్ మాట్లాడుతూ, ‘చరిత్రలో నిలిచిపోయే సబ్జెక్టులు కొన్నే ఉంటాయి అలాంటి గుర్తుండి పోయే సిరీస్ ‘తెలంగాణ త్యాగధనులు” అని తెలిపారు. ‘ఇవి 10 సీజన్లో 50 ఏపిసోడ్స్ అవుతాయో? లేక 100 సీజన్లో 500 ఏపిసోడ్స్ అనేది ఇప్పుడు చెప్పలేము. తెలంగాణ చరిత్ర కేవలం ఒక ప్రాంతానికి తెలియాల్సిన చరిత్ర కాదు జాతీయ స్థాయిలో తెలియాల్సి సిరీస్ ఇది’ అని చెప్పారు.ఇదే వేడుకలో నిర్మాత విజరు కుమార్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు.